Home » DMK
డీఎంకేకు ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన తమిళగ వాళ్వూరియా కట్చి షాక్ ఇచ్చింది. డీఎంకే సారథ్యంలోని అధికార సెక్యులర్ అలయెన్స్ నుంచి వైదొలగుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు టి.వేలుమురగన్ ఆదివారంనాడు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అరివాలయంలో డీఎంకే ఆశావహుల వద్ద ఉత్సాహభరితంగా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రజలు ఢిల్లీ అధిపత్య కూటమిని అంగీకరించరని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసి ఆ పార్టీ నుండి వైదొలగిన ప్రముఖ నటి రంజనా నాచ్చియార్ గురువారం డీఎంకేలో చేరారు.
త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ డీఎంకే ప్రభుత్వమే ఏర్పడనుందని హైదరాబాద్‌కు చెందిన ‘పారావీల్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ ప్రకటించింది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వారీగా అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ ఒక అంచనాకు వచ్చింది.
మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిరకాల భాగస్వామ్య పక్షమైన డీఎంకేతో కాంగ్రెస్ మరోసారి కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక రాజ్యసభ సీటును డీఎంకే ఆఫర్ చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే-కాంగ్రెస్ చిరకాల పొత్తు ఈసారి కూడా కొనసాగుతుందా అనే సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. సీట్ల కేటాయింపులో భాగంగా 25 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు డీఎంకే ఆఫర్ చేసింది. దీనిపై ఈనెల 3వ తేదీలోగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. చెన్నైలో సీఎం స్టాలిన్‌ను మాజీ సీఎం పన్నీర్ సెల్వం కలిశారు. ఈ సందర్భంగా డీఎంకే 5 ఏళ్ల పాలనపై పొగడ్ల వర్షం కురిపించారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. దివంగత నటుడు విజయకాంత్ స్థాపించిన...