Home » DMK
అధికార డీఎంకే నేతలు, అమాత్యులు అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) దృష్టిసారించారు. డీఎంకే ఫైల్స్ పేరుతో ఈ అవినీతి చిట్టా తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
డీఎంకే నేత సెంథిల్ కుమార్ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అతడికి బెయిల్ మంజూరు చేసిన తర్వాతి పరిణామాలను గుర్తుచేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది..
అన్నాడీఎంకే నాయకులు క్షేత్ర సమీక్ష పేరుతో అలజడులకు కుట్ర పన్నుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) ధ్వజమెత్తారు. బుధవారం 48వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మెరీనా బీచ్‌లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్మారక మందిరంలో ఉన్న కలైంజర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) సీబీఐ విచారణపై తనకోవిధంగా, ఇతరులకు మరో విధంగా ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి(RS Bharathi) ఆరోపించారు. అన్నా అరివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఇప్పటివరకు పొత్తు గురించి చర్చించలేదని, పొత్తుపై వస్తున్న వదంతులు నమ్మరాదని అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్(Former AIADMK Minister D. Jayakumar) పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పిలుపునిచ్చారు. గురువారం తూత్తుకుడి జిల్లా పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రం విమానంలో తూత్తుక్కుడి చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు.
తెలుగు ప్రజలను ఉద్దేశించి సినీ నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. రెండు కోట్ల మందికి పైగా తెలుగు ప్రజలను కించపరుస్తూ, అవమానించేలా మాట్లాడి, వారి మనోభావాలను దెబ్బతీసిన నటి కస్తూరి(Kasturi)పై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా(A. Raja)తో పాటు పలు తెలుగు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రానున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే(DMK) కూటమి 200 నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించాలని, అదే తమ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. తేనాంపేట డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం కలైంజర్ అరంగంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే దిశగా డీఎంకే సన్నాహాలను చేపడుతోంది.
టీవీకే విధానాలని చెప్పుకుంటున్నవన్నీ తమ పార్టీ విధానాలేని, తమను చూసి కాపీ కొట్టినవేనని డీఎంకే నేత టీకేఎస్ ఇలాంగోవన్ మీడియాతో మాడ్లాడుతూ అన్నారు. ఆయన (విజయ్) చెప్పినవన్నీ గతంలో తాము చెప్పినవేననీ, తాము ఏదైతే చెప్పామో దానినే పాటిస్తున్నామని చెప్పారు.
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడులో లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.