Home » Devineni Umamaheswara Rao
టీడీపీ సీనియర్లంతా టికెట్ల టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే సీనియర్లను కంగారు పెడుతోంది. పెనమలూరులో దేవినేని, నరసరావుపేటలో యరపతినేని, గురజాలలో జంగా కృష్ణమూర్తి, పెనమలూరులో ఎంఎస్ బేగ్ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. గురజాల, పెనమలూరుల్లో వేరే పేర్లతో కూడా సర్వేలు నిర్వహిస్తుండటం దేవినేని, యరపతినేనిల్లో టెన్షన్ మొదలైంది.
తమకూ.. దేవినేని ఉమామహేశ్వరరావుకు మధ్య ఎలాంటి ఆస్తి వివాదాలూ లేవని.. ఎవరి పార్టీకి వారు పనిచేయడం జరిగేదని నేటి నుంచి ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కలసికట్టుగా పని చేస్తామని దేవినేని వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
టీడీపీ-జనసేన (TDP - Janasean) తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో అలకలు, అసంతృప్తులకు గురైన నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు సీనియర్ నేతలు నేడు (ఆదివారం) చంద్రబాబును కలిశారు. వారిలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఉన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన(TDP - Janasena) కూటమి జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. వ్యూహంలో భాగంగా శనివారం నాడు ఈ రెండు పార్టీల అధినేతలు కలిసి తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ అభ్యర్థులను ఢీకొట్టేలా టీడీపీ - జనసేన అభ్యర్థులను ఆ పార్టీల అగ్రనేతలు ప్రకటించారు.
TDP-Janasena Candidates List: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(AP Elections) మరికొద్ది రోజులే సమయం ఉండటంతో.. ప్రతిపక్ష టీడీపీ-జనసేన(TDP-Janasena) కూటమి స్పీడ్ పెంచింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.
మైలవరం దేవుడు చెరువులో శంఖారావం, బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలతో పాటు మినీ మేనిఫెస్టోపై ప్రజలకు దేవినేని ఉమ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. పూరగుట్టను అబద్ధాల గుట్ట.. అని అన్నోళ్లు.. తనను జైల్లో పెడతానని అన్నోళ్ళు ఏమయ్యారని ప్రశ్నించారు.
సామాజిక న్యాయం పేరు ఎత్తే అర్హత కూడా సీఎం జగన్‌కు లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) అన్నారు.
Andhrapradesh: రాప్తాడు సభలో కల్తీమద్యం పంచి మత్తులో ఉన్న ప్రజల ముందు జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం వేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికిపోయి తలుపులేసుకొని పడుకున్నారని వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అడ్డగోలు ఇసుక తవ్వకాలతో వైసీపీ నేతలు వేల కోట్లు బొక్కేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. మొదటి రెండేళ్లు అస్మదీయ కంపెనీకి అప్పగించడం జరిగిందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.