Home » Delhi liquor scam
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. తన అరెస్టుపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ ఆయనను ఈడీ కోర్టులో హాజరుపరచనుంది.
ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆమాద్మీ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆప్ నేతలు గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, సందీప్ పాఠక్, అతిషి మర్లీనా వెల్లడించారు.
Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణం వెలుగు చూసినప్పటి ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal Arrest) అరెస్ట్‌తో ఈ కేసు పీక్స్‌కు చేరింది. 2022లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ(ED), సీబీఐ(CBI) వేసే ప్రతి స్టెప్.. తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
Arvind Kejriwal Arrest: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.
లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడాన్ని ఆప్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైద్య కారణాలతో 5 వారాలు మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. పలు షరతులను కూడా సుప్రీం ధర్మాసనం విధించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. తనకు ఇప్పటి వరకూ జారీ చేసిన 9 సమన్లను కేజ్రీవాల్ సవాల్ చేశారు.