Home » delhi liquor scam case
ప్రముఖుల అరెస్టులతో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది. మరోవైపు బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగియనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. దీంతో ఈ కేసులో కేజ్రీవాల్‌ను మరింత లోతుగా విచారించేందుకు ఈడీకి మార్గం సుగుమమైంది.
దాదాపు పదేళ్లుగా కేంద్రంలో మోదీ.. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలో ఉన్నారు..! ఈ వ్యవధిలో మోదీకి ఎందరో తలొంచారు.. మరికొందరు ఎందుకొచ్చిన గొడవని సర్దుకున్నారు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Arvind Kejriwal Arrest: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి నుంచి ఆయన ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు అడ్డుకోబోగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు.
CM Kejriwal: దేశ రాజధాని ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు సీఎం కేజ్రీవాల్(CM Kejriwal).. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు(ED).. పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Liquor Scam Case) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేస్తుందని గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం..
దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం నమోదయ్యేలా కనిపిస్తోంది. సోదాలు కోసమంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయవద్దని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. విచారించిన న్యాయస్థానం ఆయన పిటిషన్‌ని తోసిపుచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ బలవంతపు అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు చర్య (అరెస్ట్)లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును కోరారు.
MLC Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) చిక్కులు తప్పేలా లేవు. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కవితకు చుక్కెదరయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి..