Home » Delhi Excise Policy
అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో శుక్రవారం నిరాశ మిగిలింది. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బెయిలు దరఖాస్తుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. దీనిపై స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు నోటీసులు జారీ చేసింది.
మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు, అవినీతి జరిగినట్లు నమోదైన కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిలు దరఖాస్తుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ జరుపుతామని తెలిపింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు సీజ్ చేసింది.
తెలంగాణలో చేరికలతో రాజకీయ పార్టీలన్నీ బిజిబిజీగా ఉంటున్న వేళ సడన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో (TS Politics) కవిత గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. కవిత.. కవిత.. అంటూ ఆమె చుట్టూనే తెలంగాణ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయ్..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవ తీహార్ జైల్లో లొంగిపోయాడు. ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో రాఘవ ఉన్నాడు. అయితే తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును రాఘవ అభ్యర్థించాడు. రాఘవ భార్య హాస్పిటల్ రికార్డుల పరిశీలించిన తరువాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్ పరిమితిని కుదించి.. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీంకోర్టు ఆదేశించింది.
అవును.. సారు నిజంగానే మారిపోయారు.. ప్రసంగం పూర్తిగా మార్చేశారు.. నిన్న నిర్మల్‌లో, ఇవాళ నాగర్‌కర్నూల్‌లో అదే సీన్ రిపీటయ్యింది..
దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది...
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆరు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే, అస్వస్థతతో చికిత్స పొందుతున్న భార్యను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఉప్పునిప్పులా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత ఆసక్తికరంగా ఒక కార్యక్రమంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు.