• Home » Delhi Excise Policy

Delhi Excise Policy

Delhi Excise policy case: పట్టువీడని ఈడీ... సీఎంకు ఎనిమిదో సారి సమన్లు

Delhi Excise policy case: పట్టువీడని ఈడీ... సీఎంకు ఎనిమిదో సారి సమన్లు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారంనాడు మరోసారి సమన్లు పంపింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని కోరింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం ఇది వరుసగా ఎనిమిదో సారి.

MLC Kavitha: సీబీఐకి లేఖ రాసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha: సీబీఐకి లేఖ రాసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా.. ఇప్పటివరకు ఎన్నిసార్లంటే..

Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా.. ఇప్పటివరకు ఎన్నిసార్లంటే..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారకు డుమ్మా కొట్టారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం విచారణ

Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం విచారణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు విచారించనుంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 5 సార్లు సమన్లు ఇచ్చినా లెక్క చేయలేదని పేర్కొన్నారు. ఆ కేసులో ఈ రోజు కేజ్రీవాల్ కోర్టుకు రావాల్సి ఉంది. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.

Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం

Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా పావులు కదిపారు. ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారంనాడు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం శనివారంనాడు సభలో చర్చకు చేపట్టనున్నారు.

Delhi liquor scam: దిల్లీ మద్యం కేసు.. పిటిషన్ విచారణ వాయిదా: సుప్రీంకోర్టు..

Delhi liquor scam: దిల్లీ మద్యం కేసు.. పిటిషన్ విచారణ వాయిదా: సుప్రీంకోర్టు..

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 28న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా

Delhi Excise policy: సీఎంకు మనీలాండరింగ్ కేసులో ఆరోసారి ఈడీ సమన్లు

Delhi Excise policy: సీఎంకు మనీలాండరింగ్ కేసులో ఆరోసారి ఈడీ సమన్లు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వ్యవహారం ముదురుతోంది. మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరుకావాల్సిందింగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు తాజాగా ఆరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది.

Excise policy scam: ఎంపీ సంజయ్ సింగ్‌కు దక్కని ఉపశమనం... బెయిలుకు హైకోర్టు 'నో'

Excise policy scam: ఎంపీ సంజయ్ సింగ్‌కు దక్కని ఉపశమనం... బెయిలుకు హైకోర్టు 'నో'

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసు కింద అరెస్టయిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Delhi excise case: మరో కీలక మలుపు.. సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

Delhi excise case: మరో కీలక మలుపు.. సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

ఎక్సైజ్ పాలసీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదుసార్లు తమ సమన్లును బేఖాతారు చేశారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 17న హాజరుకావాలంటూ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.

Sanjay Singh: రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారానికి రెండోసారి కోర్టు అనుమతి

Sanjay Singh: రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారానికి రెండోసారి కోర్టు అనుమతి

ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ పార్లమెంటుకు వెళ్లి రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు రెండోసారి అనుమతించింది. ఫిబ్రవరి 8 లేదా 9వ తేదీల్లో ఆయన పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మంగళవారంనాడు అనుమతించారు. జ్యుడిషియల్ కస్టడీ నుంచి సంజయ్ సింగ్‌ను తగిన భద్రతతో ప్రమాణస్వీకారానికి తీసుకు వెళ్లాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి