Home » Court
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి
హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కేసులో శుక్రవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కీలక ప్రకటన చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా అల్లు అర్జున్ రిమాండ్ పొడిగింపుపై మరికొద్ది సేపటిలో వర్చ్యువల్ విధానంలో హాజరు కానున్నారు.
హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం నాంపల్లి కోర్టుకు వర్చువల్ విధానంలో హాజరవుతారు. అసలు అల్లు అర్జున్ ఈ రోజు స్వయంగా కోర్టు ముందు హాజరవుతారని అనుకున్నారు. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతున్నారు.
రాహుల్ గాంధీకి వరుసగా సమన్లు అందుతోన్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. తాజాగా బరేలి కోర్టు సైతం రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో వరుసగా ఆయన సమన్లు అందుకొంటున్నారు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఘటనలో రిమాండ్‌లో ఉన్న నిందితులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నోలోని స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న హాజరుకావాలని ఆదేశించింది.
మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని అన్నారు.
2017 మార్చి 4న ఇద్దరు యువకులు ప్రముఖ వ్యాపారవేత మనీష్ జైన్ కార్యాలయానికి వచ్చి అతని కాల్చిచంపేందుకు ప్రయత్నించారు. అయితే రివాల్వర్‌లోనే బుల్లెట్ ఉండిపోవడంతో మనీష్ జైన్ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆయన లారెన్స్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తనను చంపేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రజల దశాబ్దాల కల సాకారం అవుతుంది. ప్రజలు ఎదురుచూస్తున్న జిల్లా అదనపు సెషన్స్ కోర్టు రామచంద్రపురంలో ప్రారంభానికి సిద్ధ అయ్యింది. ఈ నెల 10న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రామచంద్రపురంలో జిల్లా అదనపు సెషన్స్ కోర్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దీంతో రామచంద్రపురం పరిసర మండలాల ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులకు జిల్లా కోర్టు బెంచి ద్వారా న్యాయసేవలు చేరువ కానున్నాయి