Home » Court
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
విజయవాడ నగరంలోని కోర్టు భవనంలో లిఫ్ట్ నిలిచిపోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య నిలిచిన లిఫ్ట్‌లో ఐదుగురు లాయర్లు చిక్కుకుపోయారు.
మంగళవారం మధ్యాహ్నం మీరట్ డిస్ట్రిక్ట్ కోర్టులో మీరట్ బ్లూ డ్రమ్ కేసు విచారణ జరిగింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను ప్రియుడు సోహెల్‌తో కలిసి హత్య చేసిన ముస్కాన్ రాజ్‌పుత్ 6 నెలల కూతురు రాధతో కోర్టుకు వచ్చింది.
ద్వంద్వ పౌరసత్వం వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై FIR నమోదు చేయాలని లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15, 16వ తేదీల్లో విచారించేందుకు అనుమతిచ్చింది.
ఒక శిశు సంరక్షణ విషయంలో ఇటీవల యూకే కోర్టు చేసిన వ్యాఖ్యలు, దానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
మచిలీపట్నం, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం కలకలం సృష్టించాయి. న్యాయమూర్తులు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు రాగా, పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.
నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్‌రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్‌రెడ్డిని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.