Home » Congress
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈఆర్ఓ, సర్కిల్-19 డీఎంసీ రజనీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎప్పుడూ చెప్పలేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై పేర్కొన్నారు. బుధవారం పెరియార్ జయంతి సందర్భంగా నగరంలోని సిమ్సన్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ బస్తీల్లో రూ.4.62 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీరు, డ్రైనేజీ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు.
1984లో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా ఖూనీ చేశారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విమర్శించారు. చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్ర పుస్తకాల్లో చేర్చాల్సిన అంశం 1984 ఘటన అని వెంకయ్య నాయుడు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కుట్ర జరుగుతోందంటూ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నంజేగౌడ గెలుపును బీజేపీ అభ్యర్థి కేఎస్ మంజునాధ్ గౌడ హైకోర్టులో సవాలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఫలితాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.
కాంగ్రెస్‌లో చేరికలను ఆహ్వానించామని ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్న నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. మీడియా ముందు అంతర్గత విషయాలు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బిహార్‌లోని దర్బంగాలో గత నెలలో కాంగ్రెస్ నిర్వహించిన సభలోనూ ప్రధానమంత్రి మోదీ తల్లిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సంకేత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయింది.
మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం ముదిరింది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చురేపింది.