Home » Congress Govt
వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి అలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో తమని గెలిపించి రాజకీయ మార్పు చూడాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు తిప్పికొట్టాలని రాంచందర్ రావు సూచించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా అని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని అంజన్‌కుమార్ యాదవ్ నిలదీశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని.. బీజేపీ చీఫ్ రామచందర్ రావును ఆయన కోరారు.
చట్టం ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశామని మల్లు రవి తెలిపారు. అసెంబ్లీలో కూడా పెట్టామని, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని రిపోర్ట్ వచ్చిందని వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు
ప్లాన్ ‘బీ’ని సిద్ధం చేసుకుని ఇవాళ హైకోర్టులో తూతూమంత్రంగా వాదనలు వినిపించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా వాడుకుంటోందని మండిపడ్డారు.
హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని ప్రయత్నాలు చేశామని స్పష్టం చేశారు.