Home » Congress 6 Gurantees
MP Balram Naik : రేవంత్ ప్రభుత్వంలో రైతులకు బోనసులు కూడా ఇచ్చామని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరామ్ నాయక్ అన్నారు. సీఆర్ హయాంలో మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని ఎంపీ బలరామ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పారు.
Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. పేపర్లో ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. వారి సంక్షేమానికి కృషి చేయాలని బండి సంజయ్ కుమార్ కోరారు.
Kalvakuntla Kavitha: రుణమాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.
Bandi Sanjay: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరచి పోయి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మోదీపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
Minister Thummala Nageshwar Rao: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు సాయం అందజేస్తామని తెలిపారు.
Rythu Bharosa scheme: కాంగ్రెస్ హామీల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం నాడు నారాయణపేట జిల్లాలో నాలుగు పథకాలను ప్రారంభించారు. అయితే రైతుభరోసా సాయం ఎప్పుడు అందుతుందోనని రైతులు ఆందోళన చెంతున్నారు. ఈ డబ్బులు త్వరగా పడితే బాగుంటుందని అన్నదాతలు అనుకుంటున్నారు.
CM Revanth Reddy: కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి.. పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
KTR:రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వన్ విలేజ్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడతోందని కేటీఆర్ ఆరోపించారు.
KTR: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఇచ్చి పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు.