Home » Collages
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు.. తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) బృందాలకు లంచాలిచ్చి, తమకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకున్నాయి.
ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెంచుకునేందుకు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)కి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
వైద్యఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మెడికల్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ ఓ ప్రకటన విడుదల చేశారు.
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సర్కారు ముందు ప్రైవేటు కాలేజీల యాజమా న్యాలు కొత్త ప్రతిపాదన ఉంచాయి.
రాష్ట్రంలో వైద్యవిద్యను గాడిన పెట్టే క్రమంలో సర్కారు రికార్డు స్థాయిలో అధ్యాపకుల నియామక ప్రక్రియను చేపట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భారీగా భర్తీ చేసేందుకు సిద్ధమైంది.
ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏటేటా పెరిగిపోతుండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కాలేజీల యాజమాన్యాలే ఫీజు చెల్లింపునకు పరిష్కార మార్గాన్ని సర్కారుకు సూచించాయి.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కాలేజీల్లో యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎప్‌సెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రవేశాలు పెంచాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రిన్సిపాళ్లను పదేపదే కోరుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల నిర్ణయానికి సంబంధించి హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.