Home » CM Siddaramaiah
రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తి కావడం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న తరుణంలోనే మంత్రుల పనితీరుపై ఏఐసీసీకి నివేదిక సమర్పించడంతో దడ పట్టుకుంది.
సిద్దరామయ్య(Siddaramaiah) ఐదేళ్ల కాలం సీఎంగా కొనసాగుతారని, మధ్యలో మార్పు ఏమీ ఉండదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్(Minister M.B. Patil) అన్నారు. శుక్రవారం హొస్పేట్ నగరంలో సిరసంగి లింగరాజ దేశాయ్ 164 జయంతి లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
వయనాడ్‌లో వరదబాధితులకు వంద ఇళ్లను నిర్మిస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Karnataka CM Siddaramaiah) రాసిన లేఖకు కేరళ ముఖ్యమంత్రి తనదైన శైలిలోనే దీటుగా స్పందించారు. వయనాడ్ పునరావాసం సహాయానికి కేరళ స్పందించలేదని ఇటీవల సీఎం సిద్దరామయ్య రెండోలేఖను పంపిన విషయం తెలిసిందే.
అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమేనని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి మునియప్ప(Minister Muniyappa) కీలక వ్యాఖ్యలు చేశారు
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ‘ముడా’ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు ఉప ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఓటమితో ఖంగు తిన్న తరుణంలోనే బలప్రదర్శనకు సిద్ధమయ్యారు.
వాల్మీకి కార్పొరేషన్(Valmiki Corporation)లో అవినీతి ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాగేంద్ర(Nagendra)ను మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నాగేంద్రకు సిద్దరామయ్య కేబినెట్‌లో బెర్త్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ప్రజాకోర్టులో గెలిచామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సంతోషం వ్యక్తం చేశారు. మూడు స్థానాల్లో మా అభ్యర్థులకు ప్రజలు ఆశీస్సులు అందించారని వారికి ధన్యవాదాలన్నారు. విజయానికి కార్యకర్తల కృషి, నాయకుల కష్టం ఉందన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందనే సీఎం సిద్ద రామయ్య(CM Siddaramaiah) ఆరోపణలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి(Union Minister Pralhad Joshi) తిప్పికొట్టారు. హుబ్బళ్ళిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నింది సిద్దరామయ్య అన్నారు.
ముడా సైట్‌లు వాపసు ఇవ్వమని అప్పుడే చెప్పలేదా... నా మాట విని ఉంటే ఎంతో బాగుండేదని ఈ కేసుల వివాదం ఏంటంటూ సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)తో కేంద్రమంత్రి సోమణ్ణ(Union Minister Somanna) ప్రస్తావించారు. సోమవారం రమణశ్రీ హోటల్‌లో జరిగిన అఖిల భారత శరణసాహిత్య పరిషత్ సభకు సీఎం వస్తుండగా అప్పుడే కేంద్రమంత్రి సోమణ్ణ బయటకు వచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్ కమల’ కుట్ర సాగుతోందని ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్ల చొప్పున చెల్లించాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారని సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మార్కెట్‌లో లభించే వస్తువులుగా పోల్చి సీఎం అవమానించారన్నారు.