• Home » CM Jagan

CM Jagan

CM Jagan: జగన్‌పై రాళ్ళ దాడి కేసుపై కోర్టులో విచారణ

CM Jagan: జగన్‌పై రాళ్ళ దాడి కేసుపై కోర్టులో విచారణ

సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి కేసుపై కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్‌పై న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీష్ కుమార్ నిరపరాధని, అమాయకుడు సతీష్‌ని పోలీసులు కేసులో అక్రమంగా ఇరికించారని న్యాయవాది సలీం అన్నారు. సీఎం జగన్ రాజకీయ లబ్దికోసమే రాళ్ళ దాడి అంటూ డ్రామాకి తెరతీసారని న్యాయవాది సలీం కోర్టుకు వెల్లడించారు.

AP Elections Results: ఫలితాలపై ఉత్కంఠ.. ఏపీలో గెలుపుపై అంచనాలు ఇవే..!

AP Elections Results: ఫలితాలపై ఉత్కంఠ.. ఏపీలో గెలుపుపై అంచనాలు ఇవే..!

ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉంది. గెలిచేదెవరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతుంటే.. లేదు.. లేదు.. వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని మరికొందరు అంటున్నారు.

AP News: ప్లీజ్.. మమ్మల్ని పంపేయండి!

AP News: ప్లీజ్.. మమ్మల్ని పంపేయండి!

మాతృ సంస్థలకు పంపేయాలని కోరుతున్న వారి జాబితాలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి మొదటి వరుసలో ఉన్నారు.

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా

బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్‌లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని ఆదేశించారు.

AP Elections: లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో.. రారో..!!: వర్ల రామయ్య

AP Elections: లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో.. రారో..!!: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.

AP Election 2024: మాకు వచ్చే సీట్లు ఇవే.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

AP Election 2024: మాకు వచ్చే సీట్లు ఇవే.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి తొమ్మిదికి తొమ్మిది గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

YS Sharmila: జగన్ నీకు సిగ్గుందా.. ఆడబిడ్డల ఉసురు తగులుతుంది.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila: జగన్ నీకు సిగ్గుందా.. ఆడబిడ్డల ఉసురు తగులుతుంది.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై (CM Jagan) ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీచేసిన విషయం తెలిసిందే.

CPI: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం: రామకృష్ణ

CPI: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం: రామకృష్ణ

తిరుపతి: వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్‌పై హత్యయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.

AP Elections: ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు

AP Elections: ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు అయ్యింది. తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలనే పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి అని ప్రశ్నించింది. మంత్రి అంబటి రాంబబు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Mla Pinneli: పిన్నెల్లికి దాసోహమన్న మాచర్ల పోలీసులు

Mla Pinneli: పిన్నెల్లికి దాసోహమన్న మాచర్ల పోలీసులు

మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు వెల్లడించారు. ఈవీఎం ధ్వంసం చేసి, అరాచకం సృష్టించిన పిన్నెలిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కలిసి మెమోరాండం అందజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి