Home » CM Jagan
ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ (YSRCP)కి భారీ షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాపు, బలిజ, ఒంటరి సంఘాల నేతలు హాజరయ్యారు.జగన్‌కు వ్యతిరేకంగా, ఎన్డీఏకు మద్దతుగా పని చేయాలని తీర్మానం చేసుకున్నట్లు సమాచారం.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ (YSRCP) ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు తెరదీసింది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలపై విషం చిమ్మెందుకు ప్రయత్నిస్తోంది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. 160 అసెంబ్లీ, 25 లోక్‌సభ, సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని హెచ్చరించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి, అనకాపల్లిలో సభల్లో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఈ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేదికల్లో అధికార వైసీపీ, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్, మే 05: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(AP CM YS Jagan) పరువు తీసేశారు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నాయకురాలు రేణుక చౌదరి(Renuka Chowdhury). జగన్ పరిపాలనా విధానాలపై(AP Capitals) సెటైర్లు గుప్పించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి..
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని సీపీఐ ముఖ్యనేత నారాయణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడంతో వెనక ఉద్దేశం అదేనని వివరించారు. రూ.వంద కోట్ల స్కామ్ ఆరోపణలు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. రూ.2 వేల కోట్ల స్కామ్ ఆరోపణలు ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన నేత, స్టార్ క్యాంపెయినర్ పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మార్పు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మార్పు కోసం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడతారని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, నెల్లూరు ప్రకాశంలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయ పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు వారం రోజులు ముందు కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం కింద ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నప్పటికీ.. ప్రభుత్వంలో కీలక అధికారులుగా ఉన్న కొంతమంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి టీడీపీ, జనసేన, బీజేపీతో సహా విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. అధికారుల పనితీరుతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడంలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Andhrapradesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్‌కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు.
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తన నివాసానికి రాలేదని ఆగ్రహం తెచ్చుకున్న ముద్రగడ.. ఆ తరువాత వైసీపీలో చేరి పవన్‌పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు ఆయన కూతురికే నచ్చడం లేదు. దీంతో ముద్రగడ కూతురు మీడియా ముందుకు వచ్చి మరీ తన తండ్రి వైసీపీ అధినేత జగన్ ఆడిస్తున్నట్టు ఆడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు