Home » Chittoor
టీటీడీ గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందాయన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో వివాదం రాజుకుంది. గోవుల మృతిపై భూమన ప్రెస్ మీట్‌లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Tirupati Hostel Incident: తిరుపతిలో ఓ ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు డిమాండ్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని, కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. అయినా ఆయన నాటకాలు ఆగడంలేదు. రోడ్డుపై పడుకుని డ్రామా చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు.
గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో తిరుమలలో కోట్లాది రూపాయల తులా భారం కానుకలను స్వాహా చేశారని, తులా భారంలో అక్రమాలు జరిగినట్లు విజిలేన్స్ నివేదిక ఇస్తే..అధికారులు తాత్కాలిక ఉద్యోగులను తొలగించి మిన్నకుండిపోయారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
మతాంతర వివాహం చేసుకున్న ఓ యవతి కన్నవారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇది పరువు హత్యేనని, తన భార్యను ఆమె కన్నవారే చంపేశారని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. చిత్తూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీడీపీ సానుభూతిపరులు కన్యాకుమారి కుటుంబంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు నారాయణస్వామి వర్గం దాడికి తెగబడింది. రాళ్లు, వేట కొడవళ్లతో హరినాథ్, వెంకటేశ్, కన్యాకుమారిపై విచక్షణారహితంగా రెచ్చిపోయారు.
Bhanu prakash Vs Bhumana: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై భాను ప్రకాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం తగదన్నారు.
మున్సిపల్ కార్యాలయానికి మంజూరు చేసిన 44 పోస్టులు భర్తీ కాకపోవడంతో పని వత్తిడి ఏమాత్రం తగ్గడంలేదు.
సచివాలయ సేవలను మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం హేతుబద్దీకరణ చేపట్టింది.ఇందులో భాగంగా సచివాలయాలను క్లస్టర్లుగా విభజించే కార్యక్రమం పూర్తయ్యింది.