Home » Chittoor
తెల్లటి పంచె.. పైజమా. మెడలో కండువా. చేతిలో కర్ర. వందేళ్లు దాటాక కూడా.. పలమనేరు వీధుల్లో నడుస్తూ.. కనిపించిన వారిని ఆప్యాయంగా పలకరించేవారు. నిరాడంబరత, నిస్వార్థ రాజకీయం, ఉన్నత వ్యక్తిత్వంతో నేటి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ (108) ఇక లేరు. బెంగళూరులోని తన కుమార్తె ఇంట శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
గడ్డి తరలిస్తున్న మినీ లారీకి కరెంటు తీగలు తగిలి.. మంటలు అంటుకున్నాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెదురుకుప్పం మండలం దామరకుప్పం రైస్‌మిల్ ఇండ్లు వద్ద చోటుచేసుకుంది.
జిల్లాలో శనివారం రంజాన్ పండగ జరుపుకోనున్నారు. దీనికోసం మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించారు.
నిమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో కృత్రిమ శ్వాస పీల్చుకుంటున్న రెండేళ్ల చిన్నారి దర్శన్‌కు ‘ఊపిరి’ పోయడానికి జిల్లా యంత్రాంగం కదిలింది.
ద్విచక్ర వాహనం నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి.. ఊపిరాడక ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఆదివారం చోటు చేసుకుంది.
తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం చంద్రగిరి మండలం రాయలపురం గ్రామంలో శనివారం నిర్వహించారు.
వైసీపీ నేతలు తెగబడ్డారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమలలో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని అడవి బూదుగురు ప్రాథమిక పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల వంటగదిలో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త ‘ఎర్రరైళ్లు’ ఈ నెల్లోనే పట్టాలెక్కనున్నాయి.