Home » China
UGVs At Tibet Border: చైనా అన్ మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ (UGV)లను పెద్ద సంఖ్యలో తయారు చేస్తోంది. వీటిని ఎక్కడినుంచైనా ఆపరేట్ చేయొచ్చు. వీటి కోసం జవాన్లు యుద్ధ భూమిలోకి దిగాల్సిన అవసరం లేదు.
చైనా రొంగ్జియాంగ్ ప్రాంతంలో ఇటీవల భారీ వరదలు (China Rongjiang Floods) స్థానికులను అతలాకుతలం చేశాయి. ఈ వరదల కారణంగా 1,20,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలించబడగా, ఆరుగురు మరణించారు. కానీ ఈ విపత్తు తర్వాత ప్రభుత్వం, స్థానిక ప్రజలు కలిసి కేవలం 7 గంటల్లోనే వీధులన్ని శుభ్రం చేసి ఔరా అనిపించారు.
India on Dalai Lama Successor: దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా (China)కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. దలైలామా (Dalai Lama)కు మాత్రమే తన వారసుడిని ఎంచుకునే హక్కు ఉంటుందని గురువారం ఓ ప్రకటనలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పష్టం చేశారు.
భారతదేశంలో ఐఫోన్ తయారీ రంగానికి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై ఫాక్స్కాన్ ప్లాంట్ (Foxconn India) నుంచి 300 మందికిపైగా చైనీస్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అనూహ్యంగా వెనక్కి రప్పించారు. ఈ నిర్ణయం ద్వారా ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని నిపుణులు చెబుతున్నారు.
చైనాలో గత 12 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న షీ జిన్పింగ్ తన ప్రాభవం కోల్పోతున్నారా? అధికారాలు క్రమంగా ఆయన చేజారుతున్నాయా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
భారతదేశం కీలక సభ్యదేశంగా ఉన్న సార్క్(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం)కు ప్రత్యామ్నాయంగా మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రయత్నిస్తున్నాయి.
మద్యం మత్తులో అతడు చేసిన ఓ పని అతడిని హాస్పిటల్లో పడేసింది. అసలు మద్యం మత్తులో తనేం చేశాడో తెలుసుకోవడానికి అతడికి తెలియడానికి ఆరు నెలల సమయం పట్టింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల కాలంలో పలువురు అధికారులపై జిన్పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అవినీతి, అనుచిత ప్రవర్తన, విధేయత లోపించడం వంటి కారణాలతో పలువురు ఉన్నతాధికారులను తొలగించింది.
వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగిన దేశాలు ఒకరితో ఒకరు ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం సహజమేనని ఖవాజా ఆసిఫ్ చెప్పారు. శాటిలైట్ ఇమేజినరీ, ఏమేరకు ముప్పు ఉండవచ్చనే సమాచారం వంటివి చైనా తమకు అందించిందని తెలిపారు.
India-China Defence Ministers Meeting: కింగ్డావోలో జరుగుతున్న ఎస్సీవో రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా కౌంటర్ అడ్మిరల్ డాంగ్ జున్.. కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభంపై జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు ఆరేళ్ల అనంతరం కైలాష్ మానస సరోవర్ యాత్ర తిరిగి మొదలుకానుంది.