Home » Chennai Super Kings
ఒక్కోసారి అభిమానం హద్దులు దాటుతుంటుంది. తమని తాము డై-హార్డ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్లు.. తమకు నచ్చిన సెలెబ్రిటీలపై అభిమానం చాటుకోవడం కోసం అప్పుడప్పుడు అతిగా ప్రవర్తిస్తుంటారు. తమ సొంత విషయాలను పట్టించుకోకుండా.. అనవసరమైన స్టంట్స్ చేయడం, తాహతుకి మించి ఖర్చులు వెచ్చించడం లాంటివి చేస్తుంటారు.
గౌతం గంభీర్-మహేంద్ర సింగ్ ధోని. ఈ రెండు పేర్లు వినగానే అందిరికీ గుర్తొచ్చేది 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో వీరిద్దరు ఆడిన ఆట ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.
చెన్నైసూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం కోల్‌కతానైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 3 బంతుల్లో ఒక పరుగు చేసి అజేయంగా నిలిచాడు.
ఐపీఎల్(IPL) చరిత్రలో రవీంద్ర జడేజా(ravindra jadeja) అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 100 క్యాచ్‌లు(100 catches) పట్టిన 5వ క్రికెటర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లతో పాటు 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తేలిపోయారు. స్లో పిచ్‌ను ఉపయోగించుకుని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. శ్రేయాస్ అయ్యర్(34) మిగతా వారంతా ఫ్లాప్ షోను కనబరిచారు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
వండర్స్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో (ఐపీఎల్, సీఎల్‌టీ20తో కలిపి) 150 విజయాలు సాధించిన మొట్టమొదటి జట్టుగా సంచలన రికార్డ్‌ని సృష్టించింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో ఇటివల జరిగిన 18వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ జట్టు చెన్నైపై గెలిచింది. కానీ ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని మాత్రం నిరాశకు గురయ్యాడు.
ఐపీఎల్ 2024 అభిమానులను అలరిస్తోంది. బ్యాటర్ల బౌండరీల వరద, బౌలర్ల వికెట్ల వేట, ఫీల్డర్ల విన్యాసాలు అభిమానులకు ఫుల్ మజా పంచుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించింది. వన్ సైడేడ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నైని సన్‌రైజర్స్ చిత్తు చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన హైదరాబాద్ బలమైన చెన్నైసూపర్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బౌలర్లు చెన్నైసూపర్ కింగ్స్‌ను 165 పరుగులకే కట్టడి చేశారు.