• Home » CBN

CBN

AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!

AP Elections: ఎన్నికల ముందు మరో కుట్ర.. చంద్రబాబు, లోకేశ్‌పై కేసు!!

ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్‌పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

AP Elections: తిరగబడుతున్న ఓటర్లు.. ఆ నేతల్లో టెన్షన్..

AP Elections: తిరగబడుతున్న ఓటర్లు.. ఆ నేతల్లో టెన్షన్..

ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.

AP Elections: నోట్లు తీసుకుంటాం.. ఓట్లు వేయం.. సర్వే సంస్థలకు షాకిస్తున్న ఓటర్లు..

AP Elections: నోట్లు తీసుకుంటాం.. ఓట్లు వేయం.. సర్వే సంస్థలకు షాకిస్తున్న ఓటర్లు..

ఎన్నికల వేళ ఏపీలో చిత్ర, విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు గ్రామాల్లో తిరుగుతున్న సర్వే సంస్థల ప్రతినిధులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారట. ఓటర్ల నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకు పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని.. ఈ ఎన్నికల్లోనే ఓటర్ల నాడి బయటపడటం లేదట.

AP Elections: ప్రచారం ఒకరికి.. ఓటు మరొకరికి.. ఆ పార్టీ నేతల్లో గుబులు..

AP Elections: ప్రచారం ఒకరికి.. ఓటు మరొకరికి.. ఆ పార్టీ నేతల్లో గుబులు..

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుుతున్న కొద్ది ప్రధాన రాజకీయపార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి, వైసీపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు స్థానికులు వస్తున్నారు. మా అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. అయితే ఈ ప్రచారానికి వస్తున్న వారిలో ఎంతమంది తమ పార్టీకే ఓటు వేస్తారో అభ్యర్థులకు అర్థం కావడంలేదట.

AP Elections: వైసీపీకి వచ్చే సీట్లపై క్లారిటీ.. అంతర్గత సర్వేల్లో తేలింది ఇదేనా!

AP Elections: వైసీపీకి వచ్చే సీట్లపై క్లారిటీ.. అంతర్గత సర్వేల్లో తేలింది ఇదేనా!

ఏపీలో రెండోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విపక్ష కూటమిని బలహీనర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, కుట్రలు ఫలించకపోవడంతో జగన్‌తో పాటు వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు వచ్చిన ఓపీనియన్ పోల్స్‌లో సైతం వైసీపీకి సానుకూలంగా లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశ చెందారు.

AP Elections: పంపకాలకే ప్రాధాన్యం.. రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నావ్ జగన్..!

AP Elections: పంపకాలకే ప్రాధాన్యం.. రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నావ్ జగన్..!

ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లు పరిపాలించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి.. గొప్పగా పరిపాలించామని చెప్పుకుంటున్నారు. ఐదేళ్ల పరిపాలన చూసి.. మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతున్నారు. ఐదేళ్ల పాలనలో ఏపీ అభివృద్ధిలో వెనకపడిందనే ఆరోపణలు ఉన్నాయి. విపక్షాలను టార్గెట్ చేసి కక్షసాధింపు చర్యలకే ఎక్కువ సమయం కేటాయించారనే విమర్శలు ఎదుర్కొన్నారు.

AP Elections  2024: మద్య నిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతావు.. జగన్‌కు బాబు సూటి ప్రశ్న

AP Elections 2024: మద్య నిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతావు.. జగన్‌కు బాబు సూటి ప్రశ్న

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శనివారం మద్య నిషేధంపై(Liquor Ban) సీఎం జగన్‌ను(CM Jagan) ఎక్స్ లో సూటిగా ప్రశ్నించారు.

AP Elections: జగన్‌పై రాయి దాడి.. మరోసారి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

AP Elections: జగన్‌పై రాయి దాడి.. మరోసారి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తలకు గాయం ఘటనను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని చూశారన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవం గ్రహించడంతో వైసీపీ కుట్రలు ఫలించలేదన్నారు. గులక రాయితో ఎవరు కొట్టారో లేదా జగన్ కొట్టించుకున్నారో ప్రజలకే తెలుసన్నారు. విజయనగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు

AP Elections: ఆ నేతల్లో ఓటమి భయం.. వైసీపీలో ఆందోళన..

AP Elections: ఆ నేతల్లో ఓటమి భయం.. వైసీపీలో ఆందోళన..

ఏపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ వ్యూహాలతో పాటు.. అనేక కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాగైనా మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా.. కూటమి బలం రోజురోజుకు పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది.

AP Elections: పెరుగుతున్న కూటమి గ్రాఫ్.. ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి నిరాశ తప్పదా..?

AP Elections: పెరుగుతున్న కూటమి గ్రాఫ్.. ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి నిరాశ తప్పదా..?

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టాలంటే 88 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. దీంతో మేజిక్ ఫిగర్ దాటేందుకు అన్ని పార్టీలు శ్రమిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తున్నాయి. పవర్‌లోకి రావాలనుకునే ఏ పార్టీకైనా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని సీట్లు కీలకం కానున్నాయి. ఈ రెండు ఉమ్మడి జిల్లాలు కలిపి 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 సీట్లలో మోజార్టీ స్థానాలు గెలిస్తే అధికారానికి దగ్గరవ్వొచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి