• Home » CBI Court

CBI Court

YS Jagan: ఖైదీ నెంబర్ 6093 @ 12 ఏళ్లు

YS Jagan: ఖైదీ నెంబర్ 6093 @ 12 ఏళ్లు

వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్.. అక్రమాస్తుల కేసులో అరెస్టయి నేటికి అంటే... మే 27వ తేదీకి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2012 మే 27వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో దిల్ కుషా గెస్ట్ హౌస్‌లో వైయస్ జగన్‌‌ని సీబీఐ అరెస్ట్ చేసింది

CBI Court: జగన్ లండన్‌ పర్యటనపై నేడే తీర్పు...

CBI Court: జగన్ లండన్‌ పర్యటనపై నేడే తీర్పు...

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై నేడు సీబీఐ కోర్టులో తీర్పు వెలువడనుంది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్ట్‌లో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం మనీలాండరింగ్‌ కేసులో కీలక అప్డేట్

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం మనీలాండరింగ్‌ కేసులో కీలక అప్డేట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) మార్చి 15న కవితను అరెస్టు చేసి... మరుసటి రోజు రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు ముందు ఈడీ హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు(శుక్రవారం) ఈ కేసులో ఎన్‌ఫోర్సమెంట్‌ డైరక్టరేట్‌ - ఈడీ ఏడో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరో నలుగురు నిందితుల పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జీషీట్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

CBI Court: సీబీఐ కోర్టును ఆశ్రయించిన వివేకా హత్య కేసు నిందితులు.. ఏం కోరారంటే?

CBI Court: సీబీఐ కోర్టును ఆశ్రయించిన వివేకా హత్య కేసు నిందితులు.. ఏం కోరారంటే?

పులివెందులలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు నిందితులో గురువారం సీబీఐ కోర్టును(CBI Court) ఆశ్రయించారు.

CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌‌కు  సీబీఐ షాక్..

CM Jagan: లండన్ పర్యటనపై జగన్‌‌కు సీబీఐ షాక్..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సీబీఐ షాక్ ఇచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నెల17 నుంచి జూన్ 1 వరకూ యూకే వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు. కుటుంబంతో జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉందన్నారు. లండన్‌లో కుమార్తెలు ఉండడంతో వారితో ఉండేందుకు విదేశాలకు వెళుతున్నారని జగన్ తరుపు న్యాయవాది తెలిపారు.

CM YS Jagan: మే 17న లండన్‌కు సీఎం జగన్.. కారణమిదేనా?

CM YS Jagan: మే 17న లండన్‌కు సీఎం జగన్.. కారణమిదేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్‌ వెళ్లనున్నారు. మే 15వ తేదీ వారు లండన్‌కు పయనమవ్వనున్నారు. అయితే మే 14వ తేదీ మధ్యాహ్నాం నుంచి వారు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన లండన్ ప్రయాణం అనుమతి కోసం వైయస్ జగన్ ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

Liquor Scam: కవిత కస్టడీ పొడిగింపు..

Liquor Scam: కవిత కస్టడీ పొడిగింపు..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది.

Delhi Liquor Case: కవితకు బెయిల్ నిరాకరణ.. వైయస్ జగన్ పేరు ప్రస్తావించిన కోర్టు

Delhi Liquor Case: కవితకు బెయిల్ నిరాకరణ.. వైయస్ జగన్ పేరు ప్రస్తావించిన కోర్టు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి.. తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత‌కు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ స్పెషల్ కోర్టు సోమవారం నిరాకరించింది. అందుకు సంబంధించి.. తన తీర్పులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా కీలక అంశాలను ప్రస్తావించారు.

Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు

Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై పదేళ్లుగా విచారణ జరుగుతుంది.

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం (రేపు) విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్టైన సంగతి తెలిసిందే. కవితను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైలులో ఉండగానే సీబీఐ అధికారులు కవితను ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి