Home » bomb blasts
ఆఫ్రికా ఖండమైన ఈశాన్య నైజీరియా(Nigeria)లోని బోర్నో రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. పలు చోట్ల చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో(Bomb blasts) 18 మంది మృత్యువాత చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.
హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పెట్టినట్లు పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది.
దేశవ్యాప్తంగా మళ్లీ బాంబు బెదిరింపులు(Bomb threat) కలకలం రేపుతున్నాయి. గతంలో పాఠశాలలు, వివిధ సంస్థలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రాగా, తాజాగా ఆస్పత్రులకు వచ్చాయి. బీఎంసీ ప్రధాన కార్యాలయం సహా ముంబై(Mumbai)లోని 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ములుగు జిల్లా: వాజేడు మండలంలో మందు పాతర పేలి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందు పాత్ర పేలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది.
రాజకీయ ఉద్రిక్తతల నడుమ కేరళ లోని కన్నూరు జిల్లాలో సోమవారం ఉదయం బాంబు పేలుడు ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ పేలుడులో ఎవరూ గాయపడకపోవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని ద్వారక(Dwarka)లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది.
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానితుడిని కర్ణాటక ( Karnataka ) లోని బళ్లారి జిల్లాకు చెందిన షబ్బీర్‌గా గుర్తించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Bomb Blast) కేసు వ్యవహారంలో కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర (G Parameshwara) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్ల వెనుక వ్యాపార శత్రుత్వం కారణమై ఉంటుందా? త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ప్రయత్నంలో ఈ పేలుళ్లు ఒక భాగమా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని (Bengaluru) రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు (Rameshwaram Cafe Bomb Blast) ఘటన నుంచి తనను ఒక ఫోన్ కాల్ కాపాడిందని కుమార్ అలంకృత్ (Kumar Alankrit) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తెలిపాడు. ఆ ఫోన్ కాల్ తనకు తల్లి నుంచి వచ్చిందని.. పేలుడు సంభవించడానికి కొన్ని సెకన్ల ముందే తాను ఆ కాల్‌ను స్వీకరించడానికి బయటకు వచ్చానని అతను పేర్కొన్నాడు.