Home » BJP
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కూడా ఓటరు జాబితా సంస్కరణ చేపట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందర్‌రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోయంబత్తూర్‌లో శుక్రవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మార్గదర్శకాలతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీని తగ్గించి, ఆర్ధిక విప్లవాన్ని అమలుచేశారన్నారు.
షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రిగా ప్రస్తుతం నరేంద్రమోదీ ఉన్నారని భవిష్యత్తులో యోగీ ఆదిత్యనాథ్ వస్తారని అప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తప్పవని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వెల్లడించారు.
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలుసుకుని కారులో తిరిగి వెళుతూ తాను ముఖం చాటేశానంటూ వస్తున్న విమర్శల్ని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కొట్టిపారేశారు. చెమటపడితే రుమాలుతో తుడుచుకుంటూ వెళ్లానని, దానిపై ప్రసార మాధ్యమాలకు తోడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం జీహెచ్‌ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్-19 కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈఆర్‌ఓ, సర్కిల్-19 డీఎంసీ రజనీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
తన సభలకు కూడా జనం భారీగా హాజరయ్యేవారని బీజేపీ నేత శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ప్రచారానికి లక్షలాది మంది తరలిరావడంపై పలు పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స్పష్టం చేశారు.
Rajnath Singh: నిజాం భారత్‌కు మాత్రమే వ్యతిరేకం కాదు.. భారత ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఇప్పటికీ దేశంలో రాజాకార్లు ఉన్నారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
Telangana Liberation Day: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.