Home » Bihar
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. భాజపా తరఫున అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె.. సుమారు 12వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బీజేపీ 95 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించనుండగా, జేడీయూ 82 సీట్లలోనూ, ఎల్‌జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో గెలుపును ఖాయం చేసుకున్నాయి.
బీహార్‌లో ఏన్డీయే విజయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందుగానే ఊహించారు. ఎన్డీటీవీ బీహార్ పవర్ ప్లే సమ్మిట్‌లో అమిత్ షా.. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే సాధించబోయే సీట్ల గురించి ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బీహార్‌లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది
బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరుకు సరఫరా చేస్తున్న వదిన మరిదిలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 18.823 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జావీద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ బిహార్ బీజేపీ శ్రేణులను సంబరంలో ముంచెత్తుతోంది. పోల్ డే రోజు పెద్ద ఎత్తున లడ్డూలు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మెజారిటీ ఎగ్జిట్ ఫోల్స్ బిహార్‌లో తిరిగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగఠ్‌బంధన్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి.
ఈసారి ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు గత ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈసారి తగ్గే అవకాశం ఉంది.
ఎన్డీయేకు 145 నుంచి 160 సీట్లు వస్తాయని 'దైనిక్ భాస్కర్' ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఎన్డీయేకు 147 నుంచి 167 సీట్లు వస్తాయని మాట్రిజ్ అంచనా వేసింది.
బిహార్‌లో విజయకేతనం ఎగరేసేది ఎవరనే విషయాన్ని రిజల్ట్‌కు ముందే ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. 6.30 గంటలకు పలు సర్వే సంస్థలు తాము చేపట్టిన సర్వే ఫలితాలును వెల్లడించాయి.