Home » Bihar
పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఆదేశాలతోనే తాను పార్టీ కార్యకలాపాలు చూసుకున్నానని, ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేసినప్పటకీ ఓటమి పాలయ్యామని తేజస్వి అన్నారు. ఇందుకు తాను బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయంపై తేజస్వీని సాధుయాదవ్ తప్పుపట్టారు. తేజస్వి సలహాదారులకు ఏమాత్రం విషయం పరిజ్ఞానం లేదని అన్నారు.
ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమావేశంలో ఎన్నికల్లో 'మహాగఠ్‌బంధన్' ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బిహార్ నుంచి వచ్చే ఏడాది రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 42 సీట్లు ఉండాలి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ కేవలం 35 సీట్లు సాధించింది.
బిహార్ లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొనున్నారు.
బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లతో ఘోరమైన పరాజయం చవిచూసిన నేపథ్యంలో లాలూ కుటుంబంలో సంక్షోభం మొదలైంది. ఆర్జేడీ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు తనపై తేజస్వి, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్ నేమత్ తనను అవమానించి, దాడి చేశారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు.
తేజ్ ప్రతాప్ తన సోదరి రోహిణి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో జేజేడీ అధికార ఖాతా నుంచి షేర్ చేశారు. తనకు అన్యాయం జరిగితే భరించానని, అయితే తన చెల్లెల్ని అవమానిస్తే మాత్రం మౌనంగా చూస్తూ ఉండేది లేదని హెచ్చరించారు.
ఎన్డీయే ప్రతిపాదించినట్టు చెబుతున్న ఫార్ములా ప్రకారం, బీజేపీకి కేబినెట్‌లో సింహభాగం వాటా దక్కనుంది. 15 నుంచి 16 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. జేడీయూకు 14 మంత్రి పదవుల వరకూ దక్కవచ్చు.
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్రానికి రూ.4.06 లక్షల కోట్ల రుణాలున్నాయని, ప్రతిరోజూ రూ.63 కోట్లు వడ్డీ కింద చెల్లింపులు జరుగుతున్నాయని పవన్ వర్మ తెలిపారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఇంట్లో విభేదాలు చెలరేగాయి. తాను ఆర్జేడీ పార్టీ, కుటుంబం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య.. తాజాగా తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు.