Home » Bihar Elections 2025
గెలుపు పక్కా అంటూ ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌కు రాఘోపూర్‌లో బీజేపీ నేత సతీశ్ కుమార్ యాదవ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. మొదట్లో సతీశ్ ఆధిక్యంలోకి రావడం ఆర్‌జేడీ వర్గాలను కాస్త టెన్షన్ పెట్టింది. అయితే, చివరకు తేజస్వీ 14 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు.
శుక్రవారంనాడు జరిగిన కౌంటింగ్‌లో అనంత్ సింగ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థి వీణాదేవిపై ఆయన గెలిచారు.
మహాగఠ్‌బంధన్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బయటపెట్టిన ఎన్డీయే కార్యకర్తల అవిశ్రాంత కృషిని ప్రధాని ప్రశంసించారు. బిహార్ అభివృద్ధిని ఎన్డీయే కొనసాగిస్తుందని, యువకులు, మహిళల బంగారు భవిష్యత్తుకు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం 202 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష మహాగట్బంధన్ 34 స్థానాలకు పతనమైంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం...
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. భాజపా తరఫున అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె.. సుమారు 12వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొడుతోంది. అదే సమయంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకి ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపుతోంది. నితీష్ కుమార్, ఎల్‌జేపీ ముందు ఆర్జేడీ పూర్తి స్థాయిలో డీలాపడింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్‌కి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తవగా.. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్‌కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్‌డేట్ మీకోసం..
బీజేపీ 95 సీట్లలో గెలుపును ఖాయం చేసుకుని రాష్ట్రంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించనుండగా, జేడీయూ 82 సీట్లలోనూ, ఎల్‌జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లలో గెలుపును ఖాయం చేసుకున్నాయి.
బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి, ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం దిశగా పయనిస్తోంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. వారి మోసాన్ని యూపీలో సాగనివ్వమంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.