Home » Bhatti Vikramarka Mallu
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని రైతు భరోసాపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.
ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని.. అసెంబ్లీలో ఈమేరకు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు తేల్చిచెప్పారు.
తెలంగాణ క్లీన్.. గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2024పై జనవరి 3వ తేదీన వాటాదారులతో భేటీ నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
దేశ నిర్మాణంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుది కీలక పాత్ర అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశం అనేక మైలురాళ్లను అధిగమించిందని గుర్తు చేశారు.
వ్యవసాయం, సంక్షేమ రంగాలకు త్వరలో పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయనున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
అప్పులు తీసుకునే విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని, షరతులు, ఆంక్షలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని అధికారం పక్షం.. ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ రూ.1.27 లక్షల కోట్లు అప్పు చేసిందని బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసుకున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ కారణంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున అక్రమార్కుల పాలయ్యాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ధరణి(Dharani ) పేరుతో పెద్దఎత్తున భూ బదలాయింపు దందా జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యాయని భట్టి ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత నుంచి 55,172 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి, 54,573 పోస్టులను భర్తీ చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.