Home » Bharath
Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోపలకు భారత సైన్యం చొచ్చుకెళ్లి క్రూయిజ్ క్రిపణి దాడులు జరిపిందంటూ ''గ్లోబల్ టైమ్స్'' కథనం పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించిన 9 ప్రాంతాల్లో 24 ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్ జరిపిందని తెలిపింది.
Operation Sindoor: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ మెరుపుదాడులపై పాకిస్థానీయులు స్పందించారు. ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు వెల్లడించారు పాక్ పౌరులు.
Operation Sindoor: భారత సరిహద్దులో పాకిస్థాన్ కాల్పుల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి అనంతరం సరిహద్దుల్లో పాక్ కాల్పుకు తెగబడుతోంది.
Asaduddin Owaisi: ఆపరేషన్ సింధూర్‌కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలిపారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత రక్షణ బలగాలు లక్ష్యంగా చేసుకున్న దాడులను తాను స్వాగతిస్తున్నానని అన్నారు.
పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.
పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.
భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడానికి మూడేళ్ల పట్టింది. మోదీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2022 నాటికి దీనిపై ఒక ముగింపునకు రావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అప్పట్నించి పలుమార్లు సంప్రదింపులు జరిగాయి.
శాంతి మార్గంలో నడవాలని భారత్ కోరుకుంటే పిడికిలి బిగించి కాకుండా నిండు మనసుతో ముందుకు రావాలని, అభూతకల్పనలతో కాకుండా వాస్తవాలతో రావాలని బిలావల్ భుట్టో అన్నారు. అప్పుడు ఇరుగుపొరుగు దేశాలుగా కలిసి కూర్చుని నిజం ఏమిటో మాట్లాడుకుందామని పేర్కొన్నారు.
పహల్గాం దాడి అనంతరం పాక్‌పై దెబ్బకు దెబ్బ తీయాలనే అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది. భారత్ సైతం పాక్‌పై వరుస కఠిన చర్యలు తీసుకుంటోంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.