Home » Bharath
భారత ఆర్థిక వ్యవస్థకు(Indias economy) మంచి రోజులోచ్చాయా? అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా 2024లో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా(forecasts) వేసింది. ప్రపంచ బ్యాంకు(World Bank) ఇంతకుముందు ఈ అంచనాను 6.3 వద్ద ఉంచడం విశేషం. అది ఇప్పుడు ఏకంగా 7.5కి పెంచింది.
వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ చర్యను భారత్ ( India ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ఇప్పడే కాదు గతంలోనూ పలు మార్లు పేర్లు మారుస్తూ మూడు జాబితాలను రిలీజ్ చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు డ్రాగన్ కంట్రీ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన భారత్ ఇలాంటి చర్యలు మానుకోవాలని చైనాకు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, చైనా పెడుతున్న ఈ పేర్లు వాస్తవాలను మార్చలేదని భారత్ ఘాటుగా స్పందించింది.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. 133 మందిని బలిగొన్న మారణకాండను తీవ్రంగా పరిగణించింది. రష్యా ( Russia ) ప్రజలకు, ప్రభుత్వానికి భారతదేశం బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్‌లాండ్ వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది.
ముంబైలో జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటం గెలుచుకుంది. ఇక భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సిని శైట్టి ఏ ర్యాంకులో ఉందో ఇక్కడ చుద్దాం.
చైనా సైన్యాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే పెద్ద ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే చైనా రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచేసింది. అయితే ఎంత పెంచిందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.
భారతదేశ వృద్ధి రేటు 2024 అంచనాలను ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారీగా పెంచింది. గతంలో 6.1%గా వృద్ధి చెందుతుందని అంచనా వేసిన ఈ సంస్థ తాజాగా 6.8%కి పెంచింది.
హౌతీ తీవ్రవాదులు(Houthi militants) ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇటీవల నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో యూరప్, ఆసియాను అనుసంధానించే కీలకమైన నీటి అడుగున ఉన్న కేబుల్లను హౌతీ మిలిటెంట్లు ధ్వంసం చేశారని సమాచారం.