Home » Bharath
చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని, చైనాను శత్రువుగా చూడటం భారత్ మానుకోవాలని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా సూచించారు.
చాలా తక్కువ వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారనున్నాయని, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఆరు నెలలలోపే ఈ అభివృద్ధి ఫలితాలు ప్రజలకు కనిపిస్తాయన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనతో పారిశ్రామిక, వ్యాపార వేత్తలు భయపడి పారి పోయారని.. అలాంటి వారంతా ఇప్పుడు ఏపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
శ్రీలంక తీరంలోని డెల్ఫ్ట్ (Delft) ఐలాండ్ సమీపానికి వెళ్లిన 13 మంది మత్స్యకారులను అక్కడి నౌకాదళం మంగళవారం తెల్లవారుజామున అడ్డుకుంది. పట్టుకునేందుకు కాల్పులు జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
2020 నుంచి నిలిచిపోయిన 'కైలాస్ మానస సరోవర్ యాత్ర' ను పునరుద్ధరించాలని ఇండియా- చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి.
ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద మాస్కులు ధరించిన కొందరు ఖలీస్థానీ సానుభూతి పరులు బెదరింపులకు పాల్పడినట్టు వార్తలు రావడంపై వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ స్పందించారు.
ఇండియా కీలక విధానమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉంది. 2024 అక్టోబర్‌లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో పర్యటించనుండటం ఇదే ప్రథమం.
రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే అంతగానే వేగంగానే నిర్ణయాలు తీసుకుంటామని, అమెరిను గొప్పగా మారుస్తామని, అక్రమ వలసలు అరికడతామని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు.
బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నూరల్ ఇస్లాంకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు సమన్లు పంపింది. దీంతో నూరల్ ఇస్లాం సౌత్ బ్లాక్ కార్యాలయానికి వెళ్లారు.
పెట్రోలింగ్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఇరువైపుల అధికారుల మధ్య రెండు రౌండ్ల చర్చలు కూడా పూర్తయ్యాయని, ఉభయ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు.
ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇండో-బంగ్లా సరిహద్దుల వెంబడి ఐదు చోట్ల ఫెన్సింగ్ నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఇంతకుముందు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.