Home » Bathukamma
Telangana: ‘‘ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ’’..
తెలంగాణలో సంప్రదాయబద్ధంగా చేసుకునే వాటిలో ప్రధానమైనవి బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు. వీటిని మహిళలు ఎంతో ఇష్టంతో చేసుకుంటారు. తెలంగాణలోని ఆడపడుచులు ఎంతో సందడిగా బొడ్డెమ్మ పండుగను జరుపుకొంటారు.
ఆశ్వయుజ మాసం శరద్రుతువులో తొలి మాసం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంతకు ఒక రోజు ముందుగానే... అంటే భాద్రపద అమావాస్య నాటి నుంచే బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి.
దేవుళ్లను పూలతో పూజించడం మనకు తెలుసు. పూలనే దేవుళ్లుగా కొలిచి పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. అలాంటి పండుగ తెలంగాణలో ఉండటం గర్వకారణం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు షురూ కానున్నాయి.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్‌రన్ హైస్కూల్‌లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు నభూతో నభవిష్యత్తు అనేలా జరిగాయి. ఇంతకుముందు వాషింగ్టన్ డీసీ బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు, పిల్లలు ఇలా సుమారు 5000 అతిథుల వరకు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.
తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. జార్జియాలో బతుకమ్మ పండుగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి కెంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ వారాన్ని (15-23) బతుకమ్మ వారంగా ప్రకటించారు.
డాలస్ నగరంలో ఏటా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (టీపాడ్).. ఈ దఫా ఆ ప్రాంతమే మురిసిపోయేట్టు మరింత వేడుకగా నిర్వహించింది.
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఓర్లాండోలో అక్టోబర్ 15వ తేదీన నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (Telangana Association of United Kingdom) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యూకే నలుమూలల నుండి మూడు వేలకు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (Telugu Association of Greater Kansas City-TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందు దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.