Home » Bangladesh
భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో జరిగే తమ మ్యాచులను మరో చోటుకు తరలించాలంటూ ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ లేఖకు ఐసీసీ సానుకూలంగా స్పందించిందంటూ తాజాగా బీసీబీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కానీ...
భారత్-బంగ్లాదేశ్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు (BPL) ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్న భారత్‌కు చెందిన రిధిమా పాఠక్‌ను హోస్టింగ్ ప్యానల్ నుంచి తొలగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా రిధిమా స్పందించారు. ఆ వార్తలను ఖండించారు.
భారత్‌తో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేయాలంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ దేశానికి చెందిన అంపైర్ల విషయంలో కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత పరిస్థితులన్నీ గందరగోళంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్‌కు తమ జట్టును పంపడానికి కుదరని బంగ్లా క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐసీసీకి లేఖ రాసింది.
డిసెంబర్ నెలలో ఏకంగా నలుగురు హిందువులు బంగ్లాదేశ్‌లో హత్యకు గురయ్యారు. దీపు చంద్రదాస్‌తో అలజడి మొదలైంది. డిసెంబర్ 31వ తేదీన ఖోకోన్ చంద్రదాస్‌కు ఓ గ్యాంగ్ దాడి చేసింది. పెట్రోల్ పోసి నిప్పంటించింది.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం మార్కెట్‌కు వచ్చిన రాణాప్రతాప్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ జట్టు ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌లో ఆడించొద్దంటూ డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ వెంటనే అతడిని జట్టులోంచి రిలీజ్ చేయాలంటూ కేకేఆర్‌ను ఆదేశించింది.
బంగ్లాదేశ్‌లో హిందూవ్యాపారి హత్య కేసులో స్థానిక పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ లో తమ దేశం ఆడే మ్యాచుల వేదికలు మార్చాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కి లేఖ రాసింది. భారత్ తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తత కారణంగా ఈ లేఖను ఐసీసీకి పంపింది.
2026 ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లా జట్టు.. భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి లేఖ రాయనుందని సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ధ్రువీకరించారు.