• Home » Bail

Bail

Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్లపై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

Delhi Liquor Scam: కవిత బెయిల్ పిటిషన్లపై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ వేశారు.

Pune: కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్

Pune: కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్

పుణేలో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు పోర్సే కారు వేగంగా వచ్చింది. తన ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి పడ్డారు. స్పాట్‌లోనే చనిపోయారు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు కారు నడిపిన వ్యక్తిని బయటకు తీశారు. దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. చిన్న వయస్సు ఉంది. ఆ యువకుడికి 17 ఏళ్లు అని తేలింది. క్లబ్‌లో పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది.

Amit Shah: కేజ్రీకి సుప్రీం స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌..

Amit Shah: కేజ్రీకి సుప్రీం స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌..

కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలా మంది.. కేజ్రీవాల్‌కు (కోర్టు) స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్టు నమ్ముతున్నారు’’ అని ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం.. 75 ఏళ్ల వయసు రాగానే.. అంటే 2025లో మోదీ రిటైర్‌ అవుతారంటూ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపైనా అమిత్‌ షా స్పందించారు.

Amit Shah: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిలు రొటీన్ జడ్జిమెంట్ కాదు..

Amit Shah: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిలు రొటీన్ జడ్జిమెంట్ కాదు..

లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 'ఏఎన్ఐ' వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ఇది రొటీన్ జడ్జిమెంట్ కాదని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.

HD Revanna: హెచ్‌డీ రేవణ్ణకు ఊరట.. కిడ్నాపింగ్ కేసులో కండిషన్డ్ బెయిల్

HD Revanna: హెచ్‌డీ రేవణ్ణకు ఊరట.. కిడ్నాపింగ్ కేసులో కండిషన్డ్ బెయిల్

హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడుల బాధితురాలిని అపహరించారనే కేసులో ఆయన తండ్రి, జనతాదళ్ సెక్యులర్ నేత, హోలెనర్సిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ సోమవారంనాడు మంజూరు చేశారు.

Arvind Kejriwal Bail: ఆంజనేయుడి చెంతకు అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో తొలి ప్రచారం నేడే

Arvind Kejriwal Bail: ఆంజనేయుడి చెంతకు అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో తొలి ప్రచారం నేడే

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తనపై హనుమంతుడి ఆశీర్వాదం ఉందని.. జైలు నుంచి బయటకి వచ్చాక కేజ్రీ వ్యాఖ్యానించారు.

TG: బెయిల్‌పై క్రిశాంక్‌ విడుదల..

TG: బెయిల్‌పై క్రిశాంక్‌ విడుదల..

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లు, మెస్‌ మూసివేతపై నకిలీ సర్క్యులర్‌ వైరల్‌ చేసిన కేసులో అరెస్ట్‌ అయిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న క్రిశాంక్‌ కు న్యాయస్థానం షరతులో కూడిన బెయిర్‌ మంజూరు చేసింది.

Supreme Court: కేజ్రీవాల్‌కు బెయిల్‌..

Supreme Court: కేజ్రీవాల్‌కు బెయిల్‌..

మద్యం విధానం కేసులో యాభై రోజులుగా తిహాడ్‌ జైల్లో మగ్గుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల తుది దశ జూన్‌ 1న ముగియనున్న నేపథ్యంలో.. జూన్‌ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది.

Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల...తొలి రియాక్షన్ ఇదే

Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల...తొలి రియాక్షన్ ఇదే

మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు.

Kejriwal Bail: కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ షరతులివే..

Kejriwal Bail: కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ షరతులివే..

లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉండగా లిక్కర్ స్కామ్‌ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పలు షరతుల మీద కేజ్రీవాల్‌కు జూన్ 1వ తేదీ వరకూ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి