Home » AV Ranganath
నిర్మాణరంగ, ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా(HYDRA) నిర్ణయించింది. చెరువులు, నాలాలు, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
Hydra: అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ఉన్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలపై ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో మరో అడుగు వేసింది.
బుద్ధభవన్‌లోని హైడ్రా(HYDRA) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై 89 ఫిర్యాదులు అందాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాన హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని వంద అడుగుల రోడ్డులో పాలమూరు గ్రిల్స్ పక్కన చేపట్టిన అక్రమ నిర్మాణంపై హైడ్రా కొరడా ఝళిపించింది.
Ranganath: అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్‌లో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వేలాది మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఈ హాస్టల్స్‌లో ఉంటున్నారని అన్నారు. ఈ హాస్టల్స్ వల్ల ప్రతీ రోజూ అయ్యప్ప సొసైటీలో డ్రైనేజ్, సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతుందని చెప్పారు.
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, నాలాలు, ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో భాగంగా హైడ్రా(HYDRA).. ఇకపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించేందుకు సిద్ధమైంది.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం పరిశీలించారు.
ఖాజాగూడ(Khajaguda)లోని భగీరథమ్మ, తౌటోనికుంటల వద్ద ఆక్రమణల తొలగింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్థానికులూ మండిపడుతున్నారు.