Home » Asia cup 2023
రానున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మనే స్పష్టం చేశాడు.
ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్ 2023 కోసం బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. చాలా కాలం పాటు గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. అంతేకాకుండా తొలిసారి ఇద్దరు తెలుగు కుర్రాళ్లకు కూడా సెలక్టర్లు అవకాశం కల్పించారు.
ఆసియా కప్ లీగ్ దశలో భాగంగా సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం తొలి దశ టిక్కెట్ల విక్రయాలను శుక్రవారం నాడు పీసీబీ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభించిన గంట లోపే అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 35వేల టిక్కెట్లను విక్రయానికి అందుబాటులో ఉంచగా అభిమానులు వాటిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు.
చూస్తుండగానే ఆసియాకప్ 2023 టోర్నీ(Asia Cup 2023) దగ్గరకు వచ్చేసింది. ఇందుకోసం జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాయి. ఈ ప్రాక్టీస్‌లో భాగంగానే బంగ్లాదేశ్ యువ ఆటగాడు మహ్మద్ నయిమ్(Bangladesh cricketer Mohammad Naim) ఏకంగా నిప్పులపై నడవడం ఆసక్తికరంగా మారింది.
సరిగ్గా మరో 2 నెలల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇందుకోసం టోర్నీలో పాల్గొనే జట్లు 15 మందితో కూడిన తమ తొలి స్క్వాడ్ వివరాలను ఐసీసీకి సెప్టెంబర్ 5 లోపు అందివ్వాలి. తుది స్వ్కాడ్ వివరాలు సెప్టెంబర్ 27లోపు తెలపాల్సి ఉంటుంది. ఈ లోపు ముందుగా ప్రకటించిన స్క్వాడ్‌లో ఎన్ని మార్పులైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. జూనియర్ల తరహాలో కాకుండా సీనియర్లు ఆసియా కప్ విజేతగా నిలుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమర్జింగ్ ఆసియా కప్‌లో టీమిండియా కుర్రాళ్ల జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. టోర్నీ ఆసాంతం అపజయం లేకుండా సాగినా ఫైనల్లో మాత్రం యువ క్రికెటర్లు అనుభవలేమితో ఓటమి పాలై అభిమానులను నిరాశపరిచారు.
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య ఆటపరంగానే కాకుండా మాటల పరంగానూ పోటీ నెలకొంది. ఈ పోటీ రెండు జట్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రధానంగా 26వ ఓవర్లో భారత ఆటగాడు హర్షిత్ రానా, బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ మధ్య మాటల తూటాలు పేలాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎప్పుడో ఒకసారి జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి అభిమానులందరికీ ట్రిపుల్ ధమాకా ఆఫర్ తగిలినట్లుగా భారత్, పాకిస్థాన్ జట్లు 15 రోజుల్లోనే ఏకంగా 3 సార్లు తలపడితే ఎలా ఉంటుంది. అభిమానులకు ఫుల్ మజా అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఆగష్టు 30న టోర్నీ ప్రారంభమై సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా జరగనుంది.
దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా మంగళవారం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆసియా కప్ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఈ శుక్రవారం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.