Home » Arvind Kejriwal
లోక్‌సభ ఎన్నికల(lok sabha election 2024) నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్‌ను 7 రోజులు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే పొడిగించాలని చెప్పినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా దేశరాజధానిలో పోలింగ్ జరుగుతుండగా పాకిస్థాన్ మంత్రి ఫవద్ చౌదరి మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. అయితే, అంతే వేగంగా కేజ్రీవాల్ స్పందించారు. ''ముందు మీ సొంతిల్లు చక్కబెట్టుకోండి'' అంటూ పాక్ మంత్రికి క్లాస్ పీకారు.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. లోక్‌సభకు శనివారం జరుగుతున్న 6వ దశ పోలింగ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన కేజ్రీవాల్‌ను కలిసేందుకు వచ్చిన సమయంలో తనపై బిభవ్ కుమార్ విచక్షణరహితంగా దాడి చేశారని గుర్తుచేశారు.
ఇండియా కూటమి గెలిస్తే ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని కేజ్రీవాల్ తెలిపారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలన్నదే తన లక్ష్యమని అన్నారు. వాళ్లు తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పరోక్షంగా బీజేపీని విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారంపై ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగి, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు బుధవారంనాడు పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
'ఆమ్ ఆద్మీ పార్టీ' చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వల బిగుసుకుంటోంది. 2014-2022 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులను 'ఆప్' అందుకుందంటూ హోం మంత్రిత్వ శాఖకు ఈడీ రిపోర్డ్ చేసింది.
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. అరెస్ట్‌ను నిరసిస్తూ ఈ రోజు ఆప్ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చింది. సీఎం కేజ్రీవాల్, ఆప్ ముఖ్యనేతలు బీజేపీ కార్యాలయానికి తరలి వచ్చారు. ఆప్ నేతల బీజేపీ ఆఫీసు ముట్టడి నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు.