Home » Army
జమ్మూ-కశ్మీరులోని పూంఛ్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినవారి గురించి ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా పాతికేళ్ల లోపు వయసుగలవారేనని, వీరు పాకిస్థాన్ జాతీయులని, భారత దేశంపై జీహాద్ (యుద్ధం) చేయడానికి వచ్చారని వెల్లడైంది.
భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో శుక్రవారం విప్లవాత్మక పరిణామం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమయ్యే విధంగా యుద్ధ విమానం ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్ ద్వైపాక్షిక చర్చల అనంతరం దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది.
దేశ సేవకు అంకితమైన కొడుకును చూసి తల్లి ఎంతో సంతోషించింది. మరోవైపు.. తనకు, పిల్లలకు దూరంగా ఉన్నా కూడా దేశం కోసం తన భర్త కష్టపడడం చూసి భార్య కూడా గర్వంగా ఫీలయ్యేది. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. అంతా ..
కడుపు కాలిపోతున్నా పాకిస్థాన్ దుర్మార్గపు బుద్ధిలో మార్పు రావడం లేదు. సొంతింటిని చక్కదిద్దుకోవడం కన్నా భారత దేశాన్ని ఇబ్బందులపాలు చేయడం కోసం సరికొత్త పన్నాగాలు పన్నుతోంది. ఇప్పటి వరకు కశ్మీరు లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎగదోసిన ఆ దేశం ఇప్పుడు జమ్మూపై కన్ను వేసింది. తీవ్ర స్థాయిలో శిక్షణ పొందిన ఉగ్రవాదులకు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చి పంపిస్తోంది.
దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడికిపోతున్న మణిపూర్ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు వచ్చిన సైన్యాన్ని స్థానిక మహిళలు అడ్డుకుంటున్నారు. సైనిక వాహనాలు నడవకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లను తవ్వేస్తున్నారు. వీరి రక్షణతో హింసాత్మక నిరసనకారులు తప్పించుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు తమకు సహకరించాలని సైన్యం ట్విటర్ వేదికగా ప్రజలందరినీ కోరింది.
మన దేశంలోకి అక్రమ చొరబాట్ల నిరోధక చర్యల్లో భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు శుక్రవారం తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరు మరణించినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను సైన్యం, పోలీసులు సంయుక్తంగా గురువారం రాత్రి ప్రారంభించినట్లు చెప్పారు.
భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో మరో విజయం సాధించాయి. నియంత్రణ రేఖ వెంబడి నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా, డొబనార్ మషల్ ప్రాంతంలో వీరిని మట్టుబెట్టినట్లు కశ్మీరు పోలీసులు ప్రకటించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు
హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. సోమ-మంగళవారాల మధ్య రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో బీఎస్ఎఫ్
మణిపూర్ లో ఇటీవల తలెత్తిన భారీ హింసాకాండ ఇప్పడిప్పుడే తగ్గుపడుతున్న సమయంలో సోమవారంనాడు మళ్లీ తాజా ఘర్షణలు తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. ఇంఫాల్‌లోని న్యూ చెకాన్ ఏరియాలో మైతీ, కుకీ వర్గాలు బాహాబాహీకి దిగాయి. రెచ్చిపోయిన అల్లరిమూక లాంబులేన్ ప్రాంతంలో ఇళ్లకు నిప్పుపెట్టింది. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది.