Home » AP Police
తమ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలన విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
విజయవాడలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను అధికారులు నియమించారు.
సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్ ఎస్పీలకు కొత్త పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ కీలక విషయాలు వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావుతో పాటు మరికొందరిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో భాగంగా హైదరాబాద్‌లో గురువారం పలుప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సీబీఐ కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఈరోజు (సోమవారం) భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 విభాగంలో కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చంద్రగిరి మండల పరిధిలోని అగరాల సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుమీదకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది.