Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్‌సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పనితీరును గమనించిన ఏపీ ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చారు. పాలనను గాలికొదిలేసి వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రజలంతా చూశారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టి.. ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly Election Results) ఎన్నికల ఫలితాలపై జనసేన నేత నాగబాబు(Nagababu) స్పందించారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీ అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిలబడిన 21స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలవడం అనేది పవన్ కల్యాణ్‌పై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో సవాళ్లు విసిరిన ఆ పార్టీ సీనియర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎక్కడా.. ఎవరి మాటా.. వినిపించడం లేదు. అయితే ప్రచారం సమయంలో అతికి పోయి సవాల్ చేసిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్ని్కల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది.
226 రోజులు... 3,132 కిలోమీటర్ల దూరం... ఆంక్షలు, అడ్డంకులను అధిగమించి టీడీపీ యువ నేత నారా లోకేశ్ చేసిన పాదయాత్ర ఫలించింది.
ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాలు
గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేసి ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచిన పార్టీ.. ఆ పార్టీ అధినేత పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలయ్యారు.
సైకిల్ కూటమి సునామీలో అనంతలో అధికార పార్టీ గల్లంతైంది. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకీ సాధ్యం కాని తిరుగులేని, చారిత్రక విజయాన్ని టీడీపీ కూటమి సొంతం చేసుకుంది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ ఖాతాలో వేసుకున్నాయి. ఒక దశలో గుంతకల్లు, ధర్మవరం, కదిరి, మడకశిర నియోజకవర్గాలలో ఒకటో రెండో వైసీపీ ఖాతాలోకి వెళుతున్నట్లు కనిపించాయి. కానీ అలాంటి అవకాశాన్ని ఓటర్లు ఏమాత్రం ఇవ్వలేదు. గంపగుత్తగా చంద్రన్నకు కానుకగా ఇచ్చేశారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 12 స్థానాలను టీడీపీ గెలిచింది. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో ఒక్క తాడిపత్రి మినహా 13 అసెంబ్లీ స్థానాలను టీడీపీ, వామపక్ష కూటమి గెలిచింది. ఈ రికార్డులన్నింటినీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ...
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్‌పై ఫైనల్‌గా ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లకు...