Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్‌సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి భారీ విజయం సాధించింది. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ లోపే వైసీపీ నుంచి జంపింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వైసీపీ ముఖ్యనేత రావెల కిశోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతోందని ప్రకటించారు.
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు.
అధికారం చేపట్టాక ఐదేళ్లపాటు అరాచకం సృష్టించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, మీడియా ప్రతినిధులు.. ఇలా అందరిపైనా దాడులకు తెగబడ్డారు. తమకు దాసోహమైన పోలీసు అధికారుల అండతో రెచ్చిపోయారు. రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా పలుమార్లు హింసాత్మక ఘటనలలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలతోపాటు సామాన్యులపై సైతం దాడికి దిగారు. అధికారం చేతులు మారడంతో ఇప్పుడు తమపై ఎక్కడ ప్రతీకార దాడులు జరుగుతాయోనని...
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఆయా పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేక్‌లు కట్‌చేసి, బాణాసంచా కాల్చి కూటమి విజయాన్ని వేడుకుగా జరుపుకుంటున్నారు.
టీడీపీ కూటమి తరఫున అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగిన అంబికా లక్ష్మీనారాయణ భారీ మెజార్టీని సొంతం చేసుకున్నారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణపై 1,88,555 ఓట్ల మెజార్టీతో ఆయన ఘన విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ శ్రీసత్యసాయి జిల్లావాసులే కావడం గమనార్హం. అంబికా లక్ష్మీనారాయణ టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శంకర్‌నారాయణ పెనుకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే. పార్టీ అధినాయకత్వాల ఆదేశాల మేరకు వీరిద్దరూ అనంతపురం పార్లమెంటు స్థానంలో పోటీ పడ్డారు. అంబికా లక్ష్మీనారాయణది బోయ సామాజికవర్గం. ...
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వణికించాయి. ఊహించినట్లుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తారు. వైసీపీ అభ్యర్థులు సైతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తగ్గించేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. ఓట్లను ఇనవ్యాలీడ్ చేయించేందుకు కోర్టులకు ఎక్కారు. అన్ని అడ్డంకులను దాటుకుని.. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయినా, ఇన వ్యాలీడ్ ఓట్లు భారీగానే నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 3,582 పోస్టల్ ఓట్లు చెల్లలేదు. ...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Election Results) కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) జూన్-09న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపిస్తున్నారు. ఓట్లు గల్లంతయ్యాయని.. ఈవీఎంలు టాంపరింగ్ జరిగాయని ఆరోపించారు. తనవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. బుధవారం నాడు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. నరేంద్ర మోదీ ఇంట్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినలో పర్యటించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకునే వరకూ అందరి చూపు.. చంద్రబాబుపైనే..
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి(Kutami) భారీ విజయంతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. 39ఏళ్ల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఘన విజయం సాధించడంపైనా నారా లోకేశ్(Nara Lokesh)పై అభినందల వర్షం కురుస్తోంది.