Home » AP Assembly Sessions
స్పీకర్ అయ్యన్న పాత్రుడుపైనా అత్యాచారయత్నం కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా అందరూ గత పాలకులు పెట్టిన అక్రమకేసుల బాధితులే అని సీఎం చెప్పుకొచ్చారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌తోపాటు పలువురుపైనా పోలీసులను ప్రయోగించారని హోంమంత్రి అనిత గుర్తుచేశారు. చాలా మందికి తాము ఎందుకు జైలుకు వెళుతున్నామో తమకు తెలియని పరిస్ధితి అప్పట్లో ఉండేదన్నారు.
సభాపతిగా నేను ఈ కుర్చీలో కుర్చున్నా నాకు కూడా కొంత ఆవేదన కలుగుతుంది. ప్రెస్ మీట్, సోషల్ మీడియాలో రోజు చూస్తున్నాం వారు మాట్లాడే తీరు. మళ్లీ మేమే వస్తాం మీ అంతుచూస్తాం, పీకలు కోస్తాం... రప్ఫా రప్ఫా అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారని అయ్యన్నపాత్రుడు అన్నారు.
షిప్ బిల్డింగ్ యూనిట్, ఘంటసాల వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీకి శాశ్వత భవనాలు నిర్మాణం, మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ, బొబ్బిలిలో గ్రోత్ సెంటర్‌లో అవకతవకలపై ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం ఇచ్చారు.
ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు. ఎన్నికల వాగ్దానాలను గుర్తుపెట్టుకుని అమలు చేసి ఉంటే వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చేది కాదని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడళ్లు అభివృద్ది పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని టీడీపీ సభ్యుడు మండిపడ్డారు. అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు బి తిరుమలనాయడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడింది. అక్వా డెవలప్‌మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాయి.
టెక్నాలజీ వాడి పౌర సరఫరాల వ్యవస్థను పారదర్శకత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్మార్ట్ రైస్ కార్డులను అందించడం సహా ఈపోస్ యంత్రాలను ఆధునీకరించి అందిస్తున్నామని తెలిపారు.
జగన్‌పై ఉన్న అవినీతి కేసులు, ఈడీ కేసులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల్లో ఇంకెన్నేళ్లు జైల్లో మగ్గాల్సి ఉంటుందో..? అని అనుమానం వ్యక్తం చేశారు.
భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసి మూడుముక్కలాట ఆడిందని మండిపడ్డారు.