Home » Andhra Pradesh Politics
ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని గుప్పిటపట్టింది. 13 ఉమ్మడి జిల్లాలకు గాను 8 జిల్లాలు.. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీ ఖాతాయే తెరవలేదు. మిగతా ఐదు జిల్లాల్లో కడపలో మాత్రమే మూడు సీట్లను గెలుచుకుంది.
AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అభినందనలు తెలిపారు రేవంత్. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్.
పాలస్తీనా (Palestine) రఫా నగరం (Rafah city)పై ఇజ్రాయెల్ దాడులకు (Israeli attacks) నిరసనగా విజయవాడలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రజా సంఘాల నాయకులు సదస్సు నిర్వహించారు. ఇజ్రాయెల్ మారణకాండపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు (CPM state secretary Srinivasa Rao) మండిపడ్డారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని.. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. సరిగ్గా ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యిందన్నారు. తెలంగాణలో రాష్ట్రావిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని.. ఏపీలో మాత్రం పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందన్నారు.
రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.
YS Sunitha: వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీత సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. జగన్‌పై జరిగిన దాడి.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మొన్నటి దాకా వలంటీర్లంతా తమ వారేనన్నారు. పార్టీ కోసం అడ్డగోలుగా వాడుకున్నారు. ఎన్నికల ముందు చాలామందితో రాజీనామా చేయించి మరీ ప్రచారం చేయించుకున్నారు. అవసరం తీరిపోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు మొహం చాటేస్తున్నారు. పాపం... వలంటీర్లు పావులుగా మారిపోయారు
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయమిది! ఆదివారంతో పదేళ్ల కాలం పూర్తవుతోంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణతో నవ్యాంధ్రప్రదేశ్‌కు ఉన్న రుణానుబంధం ‘సాంకేతికంగా, చట్టపరంగా’ పూర్తిగా తెగిపోతోంది.
AB Venkateswara Rao Retirement: ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసేందుకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం(Andhra Pradesh Government) ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(Jawahar Reddy) ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, శుక్రవారం ఉదయమే ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇదే రోజున సాయంత్రం పదవీ విరమణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.