Home » Anam Ramanarayana Reddy
Maha Sivaraththiri: శ్రీకాళహస్తిలో కొలువు తీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం జరగనున్నాయి. ఇవి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
Minister Anam Ramanarayana Reddy : ఏపీలో పలు ఆలయాల పుననిర్మాణానికి నిధుల కేటాయింపులు జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. చరిత్ర, పవిత్రతను భవిష్యత్తు తరాలకు అందిస్తామని చెప్పారు. అందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వానికి భక్తులూ అండగా ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
Minister Anam Ramanarayana Reddy: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమృతధార పథకంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్‌లు సరిగా లేవని అధికారులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే తనతో పాటు సహచర మంత్రులందరం కలిసి తిరుపతి చేరుకుని మృతుల కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూశామన్నారు. మృతుల్లో నలుగురు ఏపీ, ఒకరు తమిళనాడు, మరొకరు కేరళాకు చెందినవారు ఉన్నారని తెలిపారు.
అమరావతి: తిరుపతి ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి ఆనం అమరావతి నుంచి మృతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు హుటాహుటీన తిరుపతికి చేరుకున్నారు.
Andhrapradesh: నూతన సంవత్సరంలో పోలవరం పూర్తి చేసుకుంటామని, జలహారం.. సాగరమాల పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలని ప్రజలు పూజలు చేయాలని కోరారు.
సింహాచలం దేవస్థానం భూముల్లో ఇప్పటికే 12 వేల మందికి పైగా ఆక్రమణదారులు నివాసాలు కట్టుకున్నారని మంత్రి ఆనం తెలిపారు. వారికి ఆ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలనే దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన చెప్పారు. దేవస్థానం భూముల సమస్య న్యాయస్థానం ఆమోదంతో త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చి పట్టాదారు పాసు పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను ముద్రించిందని మంత్రి ఆనం మండిపడ్డారు. నాటి ప్రభుత్వం రైతులను నిలువు దోపిడీ చేసే ప్రయత్నం చేసిందని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని, పూర్వ వైభవం తీసుకువచ్చామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గతంలో భక్తులు అనేక ఇబ్బందులు పడే వారని.. ప్రస్తుతం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు.
అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోళ్లలో జగన్ రెడ్డికి 200 మిలియన్ డాలర్ల లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు.