Home » Airport
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ బలగాలు శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి.
భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలో భారీ బలగాలతో విస్తృత తనిఖీలు, షార్‌లోనూ భద్రత ముమ్మరం చేశారు
Bombs Threat: భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేసి కొంతమంది హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
శంషాబాద్ టు వియత్నాం.. నూతన విమాన సర్వీ్‌సును ప్రారంభించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులో ఉండగా ఇప్పుడు వియత్నాం విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వియత్నాం రాజధాని హనోయ్‌కు నూతన విమాన సర్వీ్‌సును ప్రారంభించారు.
Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
ఢిల్లీ విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, మాస్కో బయలుదేరిన విమానంలో పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది మధ్యాహ్నం 3.50 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతిస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర స్థితిని ప్రకటించారు.
లింగంపల్లి నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీహెచ్ఈఎల్ అధికారులతోపాటు ఇతర వర్గాల వారు విమాన ప్రయాణం చేయాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాగే లింగంపల్లిలో రైల్వేస్టేషన్ కూడా ఇటు రైల్వే, అటు విమాన ప్రయాణానికి వీలుగా ఆర్టీసీ సిటీస్సులను ఏర్పాటు చేసింది. ఆ బస్సుల సమయం వివరాలిలా ఉన్నాయి.
జూన్ 1 నుంచి ఇండిగో సంస్థ విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీస్‌ను పునఃప్రారంభిస్తోంది. ఉదయం 7.15కి విజయవాడ నుంచి బయలుదేరి 8.25కి విశాఖ చేరుకుని, తిరిగి 8.45కి బయలుదేరి 9.50కి విజయవాడకు చేరుకుంటుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.