• Home » AIADMK

AIADMK

AIADMK: అన్నాడీఎంకే ఆఫీసులో ప్రేతాత్మ వదంతులు..

AIADMK: అన్నాడీఎంకే ఆఫీసులో ప్రేతాత్మ వదంతులు..

స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌ మాళిగై’లో ప్రేతాత్మ సంచరిస్తున్నట్లు వదంతులు షికార్లు చేస్తున్నాయి. వాటిని నిజమని నమ్మే విధంగా ఐదురోజులుగా ఆ కార్యాలయం వద్ద సాయంత్ర వేళ్లలో ఓ మాంత్రికుడు సంచరిస్తూ శంఖాన్ని ఊదుతూ కనిపిస్తున్నాడు

Hero Vijay: హీరో విజయ్‌కి అన్నాడీఎంకే గాలం..  డిప్యూటీ సీఎం పదవి ఆఫర్‌..

Hero Vijay: హీరో విజయ్‌కి అన్నాడీఎంకే గాలం.. డిప్యూటీ సీఎం పదవి ఆఫర్‌..

డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న అన్నాడీఎంకే.. విజయ్‌ విషయంలో ఒక మెట్టు దిగిందా?.. ‘కలిసివుంటేనే కలదు సుఖం’ అన్న నానుడి చందాన ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు టీవీకేతో పొత్తుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టిందా?.. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే విజయ్‌(Vijay)కు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ చేసిందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

RS Bharathi: ఆర్‌ఎస్‌ భారతి ఫైర్.. ఆ వీడియోలు చూసి ఆనందిస్తారా..

RS Bharathi: ఆర్‌ఎస్‌ భారతి ఫైర్.. ఆ వీడియోలు చూసి ఆనందిస్తారా..

మదురై మురుగన్‌ భక్తుల మహానాడులో పెరియార్‌, అన్నాదురై ద్రావిడ సిద్ధాంతాలను విమర్శిస్తూ రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తుంటే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్‌, సెల్లూరు రాజు, కడంబూరు రాజు, రాజేంద్రబాలాజీ ఆసక్తిగా చూస్తూ పార్టీ పరువును దిగజార్చుకున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chennai: అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వ్యూహాలు..8న చెన్నైకి అమిత్‌షా

Chennai: అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వ్యూహాలు..8న చెన్నైకి అమిత్‌షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జూలై 8న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్‌ ఎక్కువగా ఉన్న పార్టీలతో ఎన్టీయే మెగా కూటమిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అమిత్‌షా కొద్ది నెలల క్రితం నగరానికి వచ్చి అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నారు.

BJP: రాష్ట్రంలో రానున్నది సంకీర్ణం కాదు.. బీజేపీ పాలనే

BJP: రాష్ట్రంలో రానున్నది సంకీర్ణం కాదు.. బీజేపీ పాలనే

అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో ఆది నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా ఆయనకు షాకిచ్చారు. ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని ఈపీఎస్‌ చెబుతుండగా.. ‘అవునవును.. సంకీర్ణ ప్రభుత్వం కాదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ అన్నామలై వ్యాఖ్యానించారు.

MP Raja: హోదా మరచి మాపై దుమ్మెత్తిపోస్తారా...

MP Raja: హోదా మరచి మాపై దుమ్మెత్తిపోస్తారా...

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసత్య ఆరోపణలు చేసి, ఆయా రాష్ట్రాల్లో మతచిచ్చు రగల్చడమే పనిగా పెట్టుకున్నారని, మదురై సభలో హోదా కూడా మరచిపోయి తమపై విమర్శలు చేశారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎ.రాజా ధ్వజమెత్తారు.

AIADMK: ఎన్నికలకు సిద్ధం కండి..  ఎమ్మెల్యేలకు ఈపీఎస్‌ దిశా నిర్దేశం

AIADMK: ఎన్నికలకు సిద్ధం కండి.. ఎమ్మెల్యేలకు ఈపీఎస్‌ దిశా నిర్దేశం

మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యేలంతా సిద్ధం కావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) సూచించారు.

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.

EPS: హీరో విజయ్‌పై విమర్శలు వద్దు..

EPS: హీరో విజయ్‌పై విమర్శలు వద్దు..

టీవీకే అధ్యక్షుడు, హీరో విజయ్‌పై విమర్శలు చేయవద్దని పార్టీ శ్రేణులకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సూచించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిపై విమర్శలు గుప్పించాలని, డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Chennai: ఏం డౌట్ లేదు.. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ ఓటమి తథ్యం..

Chennai: ఏం డౌట్ లేదు.. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ ఓటమి తథ్యం..

మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి తథ్యం అని మాజీమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయ్‌కుమార్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక స్థానాల్లో అన్నాడీఎంకే పార్టీ గెలవడం ఖాయమని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి