Home » AI Technology
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి సమూల మార్పులకు లోనవుతోంది. ఇప్పుడు కేవలం నైపుణ్యం మాత్రమే సరిపోదు, ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడం ఒక తప్పనిసరి అర్హతగా మారుతోంది.
డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు..
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు..
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఏఐ సమిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్గజ ఏఐ కంపెనీలకు చెందిన లీడర్లు.. ఆయనతో కలిసి స్టేజిపై ఫొటోలు దిగారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీల మధ్య కోల్డ్ వార్ బయటపడింది..
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు మంచి స్పందన వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మిట్‌ను మరో రోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌పో టైమింగ్స్‌లో కూడా మార్పులు చేసింది.
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’లో గ్రేటర్ నోయిడాకు చెందిన గోల్‌గోతియాస్ యూనివర్సిటీకి చేదు అనుభవం ఎదురైంది. సమిట్ నిర్వాహకులు గోల్‌గోతియాస్ యూనివర్సిటీ ప్రతినిధులను అక్కడినుంచి వెంటనే వెళ్లిపోమని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ జాప్యం, సమన్వయ లోపంతో ప్రతినిధులు ఇబ్బంది పడ్డారు. ఈ గందరగోళంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ఢిల్లీలో జరుగుతోన్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో పాల్గొంటున్నారా లేదా అనే విషయంపై గత 24 గంటలుగా తీవ్రమైన సందిగ్ధత నెలకొంది. దీనిపై ఇప్పుడు స్పష్టత వచ్చింది.
సాంకేతిక పరిణామాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో వచ్చే ఐదేళ్లలో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఆటోమేషన్ పెరుగుదలతో కొన్ని ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
ఢిల్లీలోని భారత్ మండపంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026' ప్రారంభించనున్నారు. ఏఐని అందరికీ చేరువ చేయడం, బాధ్యతాయుతమైన సాంకేతికతను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్‌కు బాటలు వేయనున్నారు.