Home » Agriculture
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావానికి తేమ ఒత్తిడికి గురవుతున్న ప్రతి పంటనూ కాపాడేందుకు యుద్ధప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆదివారం జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
గుంటూరు జిల్లాలో 18 మండలాల్లోనూ వర్షం కురవగా, జిల్లా వ్యాప్తంగా ఆరుతడి పంటలు, పశుగ్రాసానికి ఎంతో మేలు చేసింది. ఎండే దశలో ఉన్న పత్తి పంటకు జీవం పోసింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు చేస్తోన్న వరి పైర్లకు కూడా ఉపయోగకరమని వ్యవసాయ అధికారులు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధరలు పొందాలంటే సర్టిఫికేషన్ కీలకం. అయితే రాష్ట్రంలో వేలాది మంది రైతులు నమోదు చేసుకున్నప్పటికీ ధ్రువీకరణ పొందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం!.
రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 30.84లక్షల హెక్టార్లకుగాను 22.82లక్షల హెక్టార్లలో సాగు పూర్తయ్యింది. సాధారణ విస్తీర్ణంలో ఇది 74శాతం కాగా, ఇప్పటివరకు సాగవ్వాల్సిన విస్తీర్ణంలో ఇది 81శాతం.
వ్యవసాయ రంగంలో కీలక భూమికను పోషిస్తూ ఆరుగాలం రైతన్నల జీవితంతో పెనవేసుకుని, సేధ్యంలో ప్రకృతితో పాటు పశుపక్ష్యాదులపై ఆధారపడి తమ సాగులో సాయపడిన వాటిన్నింటిపై ఆపేక్షను కలిగి ఉంటాడు అన్నదాత.
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని సానిపల్లి ఉల్లి సాగుకు ప్రసిద్ధి. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో పంట పెట్టేవారు.
అనువైన నేలలు, అనుకూలమైన వాతావరణం అందు బాటులో విత్తనాలు మార్కెటింగ్ సదుపాయం ఉండటంతో దశాబ్ధాలుగా రైతులు పత్తి సాగుకే సై అంటున్నారు.
రాష్ట్రంలో 2026-27 మార్కెట్ సీజన్‌లో ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తి పరిమాణం తగ్గిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. 2025-26 ఏడాదిలో 142 మిలియన్ కిలోలకు అనుమతించగా, 2026-27లో దానిని 81 మిలియన్ కిలోలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని యు.కొత్తపల్లి మండలం, పాత ఇసుకపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. పిడుగుపాటుకు గురై రైతు పి. నూకరాజు మృతిచెందడం విచారకరమని పేర్కొన్నారు.
ఆక్వా రైతుల ఎన్నో ఏళ్ల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిష్కరించారు. ఈ మేరకు మత్స్యశాఖ జీవో నంబర్-1756ను విడుదల చేసింది.