Agriculture Urea Supply: ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువ
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:55 AM
ష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
పాత బకాయిలతోపాటు ఈనెల కోటానూ ఇవ్వాలి
కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
హైదరాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ నెలలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలకు యూరియాను పైపాటుగా వాడుతారని, ఇలాంటి పరిస్థితుల్లో యూరియా సరఫరాలో ఎలాంటి ఆలస్యం తలెత్తినా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాత బకాయిలతో పాటు ఈనెల కోటా యూరియాను కూడా సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.