• Home » Adilabad

Adilabad

Adilabad: గ్రామస్తుల దాడి.. బీట్ ఆఫీసర్‌కు గాయాలు..

Adilabad: గ్రామస్తుల దాడి.. బీట్ ఆఫీసర్‌కు గాయాలు..

ఆదిలాబాద్ జిల్లా, కేశవపట్టణం గ్రామం మొదటి నుంచి కలప స్మగ్లింగ్‌కు పేరుగాంచింది. ఈ గ్రామంలో చాలా మంది కలప స్మిగ్లింగ్ చేసి జీవనోపాధిని పొందుతారు. అయితే గ్రామంలో పెద్ద మొత్తంలో కలప నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో అటవీశాఖ అధికారుల బృందాలు అక్కడకు వెళ్లాయి. ఇళ్లల్లో ఉన్న కలపను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

వేగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

వేగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

సొంతిళ్లు పేద, మధ్యతరగతి గూడు కల్పించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంది రమ్మ పేరుతో ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయిం చింది. ఇందుకుగానూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మహిళల పేరిట దరఖాస్తులు స్వీకరించింది. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందకుండా కేవలం అర్హులకు లబ్ధి జరిగేలా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మంచిర్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా

మంచిర్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసి మంచిర్యాలను సర్వాంగ సుందరంగా మారుస్తానని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని మహా ప్రస్తాన నిర్మాణ పనులను, మార్కెట్‌ ఏరియాలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలను పరిశీలించారు.

చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు

చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు

గూడెం ఎత్తిపోతల పథకం కింద యాసంగి పంట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, చీఫ్‌ ఇంజనీర్‌ బద్రినారాయణ, డీఈ దశరధంలతో కలిసి రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు

నియోజకవర్గంలో వంద కోట్లతో అభివృద్ధి పనులు

చెన్నూరు నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామి అన్నారు. శనివారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు.

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్‌డీవో కిషన్‌ సూచించారు. శనివా రం నీల్వాయి, కేతనపల్లి, ముల్కలపేట గ్రామాల్లో జరుగుతున్న నర్సరీ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే హరితహారం కోసం మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

హమాలీల సమ్మెతో నిలిచిన బియ్యం సరఫరా

హమాలీల సమ్మెతో నిలిచిన బియ్యం సరఫరా

హమాలీల సమ్మెతో చౌకధరల దుకాణాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. సంక్రాంతి పిండి వంటలు చేసుకోవ డానికి ఎక్కువ శాతం రేషన్‌ బియ్యం వినియోగిస్తారు. పండుగ సమీపిస్తున్నా రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీ జరగడం లేదు.

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

పోలీసులు క్రమశిక్షణ కలిగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం గుడిపేట 13వ బెటాలియన్‌లో జరిగిన పోలీస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (దీక్షాంత్‌పరేడ్‌)కు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

బాలిక విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే

బాలిక విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే

బాలిక విద్య కోసం కృషి చేసిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫూలే జయంతిలో డీసీపీ భాస్కర్‌, డీఈవో యాదయ్యతో కలిసి పాల్గొ న్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.

ప్రజల సంక్షేమానికి కృషి

ప్రజల సంక్షేమానికి కృషి

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌లతో సమావేశం నిర్వ హించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జన్నారం మండలం కవ్వాల్‌ పులుల అభయారణ్యం అభివృద్ధి, వన్య ప్రాణు ల సంరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల రక్షణకు కృషి చేస్తోం దన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి